22 August -September 2nd

idlebrain jeevi‏ @idlebrainjeevi
Logo of #Chiranjeevi151 will be unveiled on Chiranjeevi’s birthday on 22 August. Any guess about the title?

Suresh Kondi‏ @V6_Suresh
Much awaited #PSPK25 First Look likely to be out on September 2nd on the eve of #Powerstar birthday..Get Ready Guys..👍😀

మెగా అభిమానులకు చిరంజీవే రాజు. చిరంజీవి వారసుడు “చరణ్”. చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చే హిరోలందరూ చిరంజీవికి & చరణ్ కు ఎంత గౌరవం ఇస్తే, ఆ హిరోలకు మెగా అభిమానుల నుంచి అంత గౌరవం దక్కుతుంది.

మెగా అభిమానులకు పవన్ కల్యాణ్ ప్రత్యేకం. మెగా అభిమానులే మేజర్ బలం అయినా, తనకంటూ సొంత అభిమానులను ఏర్పర్చుకొవడంలో పవన్ కల్యాణ్ సూపర్ సక్సస్ అయ్యాడు.

ఎంతకాలం ఈ మెగా భజన చేస్తూ, వీళ్ళ క్రింద బ్రతకాలని అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ వేసాడు. చిరంజీవిని అడ్డుపెట్టుకొని, పవన్ కల్యాణ్ ను అమితంగా ఇష్టపడే మెగాభిమానులను అవమానిస్తూ, మెగా అభిమానుల మధ్య విజయవంతంగా పుల్లలు పెట్టేసాడు. సోషల్ నెట్‌వర్క్ లోనే కాదు, ఎక్కడ కలిసినా మెగా అభిమానులు మాటలతో కొట్టేసుకుంటున్నారు. ఈ నిజం మెగా హిరోలందరికీ తెలుసు. ఎవరూ బయటపడలేని పరిస్థితి.

మెగా అభిమానులు ఒక్కటయ్యే పరిస్థితులు అసలు కనిపించడం లేదు. ఇదే అదనుగా మెగాఫ్యాన్స్ ముసుగేసుకొని మెగా హిరోలందరినీ విమర్శలు చేసేవాళ్ళు మరింత ఎక్కువైపొయారు.

అభిమానులు ఎవరెన్ని గొడవలు పడుతున్నా చరణ్, చిరంజీవి & పవన్ కల్యాణ్ లు కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. అల్లు అర్జున్ పెట్టిన పుల్లలు అటువంటివి మరి. తమ తమ సినిమాలు & పనులతో బిజీ.

ఆగష్టు 22న చిరంజీవి బర్త్ డే. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డే. అభిమానులకు ఉత్సాహ పరచడానికి, తమ తమ సినిమాలకు సంబంధించి చిరంజీవి తన సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తుంటే, పవన్ కల్యాణ్ తన సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నాడు.

Filed Under: Pawan KalyanMega FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *