4 Days To Go

bahubali

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు ‘బాహుబలి’ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని ‘బాహుబలి-ది బిగినింగ్’ పేరుతో ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో… దర్శకుడు రాజమౌళి సహా చిత్రంలో నటించిన స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్ లో మునిగిపోయారు. it is very interesting to watch all of those interviews and listening to their hard work.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బాహుబలి చిత్రం మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది . కాగా అప్పుడే బాహుబలి ఫీవర్ తో అన్ని ప్రాంతాల్లోని థియేటర్ లు ఊగిపోతున్నాయి . ఇటీవల బాహుబలి సెన్సార్ కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే . అయితే బాహుబలి గురించి ఎటువంటి టాపిక్ బయటకి రావద్దు ప్లీజ్ అని దర్శకులు రాజమౌళి సెన్సార్ సభ్యులను కోరినప్పటికీ సెన్సార్ సమయంలో చూసిన సభ్యులు మాత్రం బాహుబలి చిత్రాన్ని పొగడకుండా ఉండలేక పోయారట ! ముఖ్యంగా తమిళనాడు సెన్సార్ సభ్యులైతే బాహుబలిని ఆకాశానికి ఎత్తేసారట ! బాహుబలి సెన్సార్ చేసే అదృష్టం మాకు దక్కినందుకు గర్వంగా ఉందని సౌత్ నుండి వస్తున్న ఈ చిత్రం దేశానికే మకుటంలా ఉంటుందని రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారట.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *