4 days to go

mukunda

నాగేంద్రబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న చిత్రం ‘ముకుంద’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే వుంది. క్లాస్‌కు కచ్చితంగా నచ్చే చిత్రంగా ప్రచారం జరుగుతున్న ఈ సినిమా మాస్‌ను ఎలా ఆకట్టుకుంటుందనే దాని మీదే ఈ సినిమా రేంజ్ ఆధారపడి వుంది.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో విషయం తక్కువ పబ్లిసిటీ ఎక్కువై అయిపోయింది. అంతలా పబ్లిసిటీ వుంటే కాని జనాలను థియేటర్స్‌కు రప్పించడం సాధ్యం కావడం లేదు. ఈ సినిమా పబ్లిసిటీ కూడా సినిమాకు తగ్గట్టు క్లాస్‌గానే వుంది. ఈ సినిమాను ఎక్కడా కూడా హైప్ చెయ్యకుండా ఈ సినిమాలో ఏముందో అదే వుంటుందని చెపుతున్నారు. హైప్ లేకుండా ఓపినింగ్స్ ఎలా వుంటాయో చూడాలి.

Filed Under: Mega FamilyFeatured