బ్రహ్మోత్సవం టార్గెట్ 4 మిలియన్స్

MB

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా తక్కువ మందికి కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయిన వాళ్ళకు సూపర్ డూపర్‌గా నచ్చింది. కనెక్ట్ కాని వాళ్ళకు “అదొక సినిమానా .. వురేయ్ .. ఏరా ” అని అనుకొవడం మినహా ఏముంది అనే విమర్శలతో పాటు, కొందరు టివి సిరియల్లా వుందని కూడా వెటకారం చేస్తూ వుంటారు. నిర్మాత దిల్ రాజు ఎక్స్ట్రా కేర్ తీసుకోవడంతో, అనవసరమైన మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేయలేదు. అలా చేయడం వలన కనెక్ట్ అయిన వాళ్ళకు బాగా కనెక్ట్ అయ్యింది.

ముకుంద సినిమాలో మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి ప్రయత్నం చేయడంతో ఎవరికీ నచ్చకుండా పోయింది.

బ్రహ్మోత్సవం ఏ నమ్మకంతో చేసారో సినిమా వస్తే గాని తెలియదు. పాటలు బాగున్నాయి. ట్రైలర్ కూడా మహిళలను ఆకట్టుకునే విధంగా వుంది. సినిమా కూడా అదే రేంజ్‌లో వుంటే అమెరికాలో 4 మిలియన్స్ రీచ్ అవ్వడం ఈజీ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఒక నమ్మకంతో సినిమా చేస్తున్నప్పుడు, వాళ్ళను కన్విన్స్ చెయ్యాలని వీళ్ళను కన్విన్స్ చెయ్యాలని డైవర్ట్ కాకుండా, అదే నమ్మకంతో చివరి దాక చేసినపుడు .. ఆ నమ్మకాన్ని ప్రేక్షక దేవుళ్ళు కూడా అంగీకరించినపుడు వచ్చే ఫలితం ఎలా వుంటుందో సరైనోడు సినిమా చూపిస్తుంది. మహేష్‌బాబు ఏ నమ్మకంతో ఈ సినిమాను చేసాడో, అదే నమ్మకాన్ని ప్రేక్షకదేవుళ్ళు అంగీకరిస్తే, మహేష్‌బాబు ఖాతాలో మరో సూపర్ డూపర్ హిట్.

Filed Under: Featuredబ్రహ్మోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *