6 అడుగుల 4 అంగుళాల అందగాడు

Screen Shot 2014-12-17 at 6.13.59 PM

పూజా హెగ్డే. ‘ముకుంద’ చిత్రంలో వరుణ్‌తేజ్‌కి జోడీగా నటిస్తుంది. ఈ చిత్రం గురించీ, పూజా హెగ్డే చెప్పిన కొన్ని మాటలు.

  • వరుణ్ హైట్ 6 అడుగుల 4 అంగుళాలు. మేమందరం ఒకే ఏజ్‌గ్రూప్‌లోని వాళ్లం. కళ్లతో మాట్లాడగల సత్తా వరుణ్‌లో ఉంది. ‘ముకుంద’ షూటింగ్ పూర్తయ్యేలోపే వరుణ్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఇద్దరం లంచ్‌కెళ్లినా, డిన్నర్‌కెళ్లినా.. మా ఫుడ్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకునేవాళ్లం.
  • శ్రీకాంత్ గొప్ప నేరేటర్. కథ ఎంత గొప్పగా చెప్పాడో, అంతకంటే క్యూట్‌గా సినిమా తీశాడు. నటన విషయంలో ఆర్టిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు తను. అందుకే… సన్నివేశాల్లో మా నటన సహజంగా అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ దగ్గర్నుంచీ, ప్రతి చిన్న విషయాన్నీ ఆయన దగ్గరగా గమనిస్తారు. ఈ కథ తను చెప్పినప్పుడే ‘వావ్’ అనిపిం చింది. శ్రీకాంత్ ప్రీవియస్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో…’ చూశాను. దానికంటే ఈ చిత్రం ఇంకా బాగుంటుంది.
  • ఇందులో నేను పక్కా తెలుగింటి అమ్మాయిని. రావు రమేశ్‌గారిది నా తండ్రి పాత్ర. ఆయన మాట జవదాటని కూతుర్ని నేను. ఈ కథకు నా పాత్ర కేంద్ర బిందువు. పాత్రలన్నీ నా చుట్టూ తిరుగుతుంటాయి. వరుణ్‌తేజ్ పాత్ర విషయానికొస్తే… కృష్ణుడి పాత్రలో ఉంటే షేడ్స్ ‘ముకుంద’లో వరుణ్ పాత్రలో కనిపిస్తాయి. విలువలున్న కథతో జనరంజకంగా శ్రీకాంత్ ఈ చిత్రాన్ని మలిచారు.
  • గోపికమ్మ…’ పాట వినడానికే కాదు చూడ్డానికి కూడా ఆ పాట మధురంగా ఉంటుంది. అందుకే ఇష్టంగా ఆ పాట నేర్చుకున్నాను. మణి కెమెరా పనితనం, రాజుసుందరం కొరియోగ్రఫీ ఆ పాటకు ప్రాణం పోశాయి.

Filed Under: Mega Family