AA bigger than PK

AA

హిరో దర్శకుడిని, దర్శకుడు చెప్పే కథను OK చేస్తేనే సినిమా వస్తుంది కాబట్టి, మన తెలుగు హిరోల సినిమాలు ఫట్ అయితే హిరోలే బాద్యత వహించవలసి వుంటుంది. (కొద్దిగా అతి చేసే హరీష్‌శంకర్ “రామయ్యా వస్తావయ్యా” ఫ్లాప్‌కు నేనే బాద్యత వహిస్తున్నాను అనడం కాంట్రవర్సీ అయ్యింది.అదే వేరే విషయం)

సినిమా హిట్ అయితే కథ & దర్శకుడి గొప్పతనమే అవుతుంది. కారణం “హిరో ఏమి కోరుకుంటున్నాడు? హిరో నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారు?” అనే విషయాలు దర్శకుడు కరెక్ట్‌గా అంచనా వేయగల్గాలి.

ఈ రెండు విషయాలు మన తెలుగు హిరోలందరికీ తెలుసు.

  1. కరెక్ట్ కథను & దర్శకుడిని ఎంచుకొవాల్సిన బాద్యత హిరోది.
  2. హిరోను కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయవలసిన బాద్యత దర్శకుడిది.

అలా అనుకునే అల్లు అర్జున్ వి.వి.వినాయక్‌తో “బద్రినాధ్” చేసాడు. ఫ్లాప్ అయ్యింది. గుణశేఖర్‌తో “వరుడు” చేసాడు. ఫ్లాప్ అయ్యింది.

ఎప్పుడైతే త్రివిక్రమ్‌తో “జులాయి” చేసాడో, సుడి తిరిగింది. “ఇద్దరమ్మాయిలతో” హిట్ కాకపొయినా, అల్లు అర్జున్ తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అన్నీ కలిసోచ్చి “రేసుగుర్రం”తో అటు ప్రేక్షకుల మనసుల్లోనూ, ఇటు కమర్షియల్‌గా ఎక్కడికో దూసుకెళ్ళిపొయాడు. “S/O సత్యమూర్తి”తో తన ప్రత్యేకత ఏమీ చూపించుకొలేక పొయినా, ఏమీ కొల్పోలేదు. “ఇద్దరమ్మాయిలతో” సినిమా ఏమి టార్గెట్ చేసి చేసాడో, ఇప్పుడు అదే టార్గెట్ పెట్టుకొని “సరైనోడు” చేసాడు. ఫ్లాప్ టాక్‌తో మొదలయ్యి, సూపర్‌హిట్ దిశగా దూసుకుపొతున్న ఈ సినిమా సెకండ్ వీక్ ఇంకా పికప్ ఆయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ తీసుకుంటున్న నిర్ణయాలకు, తను పడుతున్న హర్డ్‌వర్క్‌కు కాలం కలిసొచ్చి మంచి పేరుతో పాటు, కమర్షియల్‌గా నేనిమి తక్కువ కాదు అనే రేంజ్‌కు చేరుకున్నాడు. ఇదే అదనుగా “AA bigger than PK” , “AA bigger than Ram Charan” & “AA bigger than NTR” అనే మాటలు వినిపించడం సహజం. అసలు నిజం ఏమిటంటే, ఎవడి ట్రాక్ వాళ్ళది. అందరూ పరిగెడుతున్నారు. ఒకళ్ళు ఎక్కువా కాదు, ఒకళ్ళు తక్కువా కాదు.

bottomline:
అల్లు అర్జున్ తెలుగులో ఏ పెద్ద హిరో కంటే తక్కువ కాదు. తన మార్కెట్‌ను తెలుగుకే పరిమితం చేసుకోకుండా, సౌత్ ఇండియా అంతా స్ప్రెడ్ చేసుకునే ప్రయత్నంలో వున్నాడు. అభినందించవలసిన విషయం. ఆ టార్గెట్ రీచ్ అయిన రోజు, కచ్చితంగా ఒక్క పవన్‌కల్యాణ్ కంటేనే కాదు, తెలుగు హిరోలందరి కంటే ముందు వుంటాడు.

AA

Filed Under: సరైనోడు

commentscomments

  1. suresh says:

    …. change website name …..

    pk is always bigger than anybody in the industry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *