రామయ్యా వస్తాడా… అత్తారింటికి వెళ్తాడా?

attarentiki-daredi-vs-ramayya-vasthavayya

రామయ్యా తొందరగా వచ్చేయవయ్యా!
–రాజమౌళి

టాలీవుడ్ లో భారీ చిత్రాల నిర్మాతలను సమైక్యాంధ్ర ఉద్యమం గందరగోళంలో పడేసింది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జోరుగా సాగుతుండటంతో భారీ చిత్రాల విడుదలకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చిత్ర పరిశ్రమకు ప్రతికూలంగా మారడంతో అగ్రనిర్మాతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విడుదలకు అవకాశం వస్తే ఒకపక్క బాబాయ్ “అత్తారింటికి దారేది” విడుదలకు రెడిగా వుండటంతో, రామ్‌చరణ్ “ఎవడు” నిరవరధికంగా వాయిదా పడినట్టే.

ఇంతకు ముందు “రామయ్యా వస్తావయ్యా” ఆగష్టు 9 ఎనౌన్స్ చేసారో లేదో, తర్వాత రోజే “అత్తారింటికి దారేది” ఆగష్టు 7 అని ఎనౌన్స్ చేసారు. కొన్ని రోజుల తర్వాత “రామయ్యా వస్తావయ్యా” రిలీజ్ సెప్టెంబర్ 27 కి టార్గెట్ చేసారు.

చివరికి, ముందు అనుకున్నట్టే ఈ రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో రిలీజ్‌కు సిద్దం అయ్యాయి. అక్టోబర్ 9 తేదిన అత్తారింటికి దారేది?, 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదలకు సన్నద్దం చేస్తున్నారు. కాకపొతే ఈ ఉద్యమాల ప్రభావం ఏ విధంగా వుంటుందో ఊహించలేము కాబట్టి, ఈ డేట్స్ కూడా మారే అవకాశం వుంది. SO, రామయ్యా వస్తాడా… అత్తారింటికి వెళ్తాడా? అని జనాలు ఎదురుచూస్తున్నారు.

Filed Under: Pawan Kalyan