అల్లు అర్జున్ body కి రామ్ చరణ్ ఫేస్

allu-arjun-body-ram-charan-face

“అత్తారింటికి దారేది” సినిమా కోసం ఇంకా 18 రోజులు ఆగాలంటే కష్టంగా వుంది. ఆ గ్యాప్ కవర్ చేస్తూ ఈలోపు రామ్ చరణ్ “ఎవడు” వుండటం అదృష్టం. మేకర్స్ ‘మగధీర’ రేంజ్ సినిమా అవుతుందని ఎక్సపెట్ చెయ్యడంతో పాటు ‘మగధీర’ రిలీజ్ అయిన డేట్ జూలై 31నే రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకోవడంతో ‘ఎవడు’ సినిమాపై అంచనాలు పెరిగాయి. చిరంజీవి మాదిరి జస్ట్ పాటలతో ఎవరేజ్ సినిమాను సూపర్ హిట్ చెయ్యగల హీరోగా రామ్ చరణ్ ‘రచ్చ’ & ‘నాయక్’ సినిమాల ద్వారా నిరూపించుకున్నాడు.

ఈ సినిమాకు వున్న ఒకే ఒక డ్రాబ్యాక్ వారం రోజుల్లో “అత్తారింటికి దారేది” రిలీజ్. ఇంతకు ముందు మహేష్-బాబు, వెంకటేష్ & దిల్ రాజు కాంబినేషన్ ను తట్టుకొని నిలబడ గల్గాడు చరణ్. (వినాయక్ సపోర్ట్ తో).

ఇప్పుడు దిల్ రాజ్ సపోర్ట్ తో పవన్ కల్యాణ్ ను తట్టుకోవడం అంత కష్టం కాదనుకుంటున్నారు జనాలు. ఈ సినిమా కథ కూడా రొటీన్ గా వుండదు అంటున్నారు.

అల్లు అర్జున్ పొలీసాఫీసర్? .. ఫేస్ డామేజ్ అవుతుంది .. రామ్ చరణ్ ఫేస్ పెడతారు?

రామ్ చరణ్ ‘ఎవడు’ .. అనేదే ఈ ‘ఎవడు’ సినిమా.

తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన పాటలు, ఫైట్స్, ప్రేమ, పగ, సెంటిమెంట్ కు తోడు థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా వుంటుంది ..

Filed Under: Mega FamilyFeatured