అల్లు బ్రదర్స్

Allu Brothers

SKN ‏@SKNonline
.@AlluSirish shares joy of his Brother @alluarjun’s #Yodhavu super success in #Kerala tomorrow at @Redfm

కేవలం టాలెంట్ వుంటే సరిపోదు & కష్టపడితే సరిపోదు. దానికి తగ్గ ప్లానింగ్ కూడా వుండాలి. ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి “మేము మీకు చెందిన వాళ్ళమే, మీరు ఎంతగా ప్రేమిస్తారో మేము కూడా అంతే కృతజ్ఞతతో వుంటాం” అని చెప్పగల్గాలి. మళయాళ సరైనోడు ప్రమోషన్లో అన్నయ్యకు తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు. ఈ ప్లానింగ్‌కు తోడు సక్సస్ కూడా కంటీన్యూ అయితే, సౌత్ ఇండియా స్టార్ బ్రదర్స్ సూర్య & కార్తీలను డామినేట్ చేసేస్తారు.

అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్ లో వచ్చిన ’సరైనోడు’ సినిమాని తెలుగు వెర్షన్ విడుదల అయిన వారం తరువాత మళయాలం వెర్షన్ విడుదల చేయాలనుకున్నా కొన్ని కారణాల వలన అది జరగలేదు. దాదాపు ​80 థియేటర్స్ లో అల్లు అర్జున్ ‘యోధావు’ (‘సరైనోడు’ మళయాలం వెర్షన్ )కేరళలో నిన్న విడుదలైనది. కేరళలో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటున్నారు. ఈ సినిమాకి కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు కూడా వేసారంట. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ నిన్న కేరళలోని తిరువనంతపురం లో అల్లు అర్జున్ అభిమానుల తో కలిసి చూసాడంట.

Filed Under: సరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *