రైట్ రిలీజ్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు శిరీష్ గౌరవం

allusirish

చిరంజీవి కేవలం స్వయంకృషితోనే మెగాస్టార్ అయ్యాడని ఎవరైనా అంటే నేను వెంటనే ఖండిస్తాను. చిరంజీవికి ఒక వలయంలా వుండి పరఫక్ట్ ప్లానింగ్ తో పాటు, ఆ ప్లానింగ్ ను పరఫక్ట్ గా ఎక్సిక్యూట్ చేసిన అల్లు అరవింద్ కు కూడా చిరంజీవి విజయంలో కొంత భాగం ఇవ్వడానికి వాదిస్తాను.

బన్నీ హిరో అవ్వడానికి మొదటి కారణం చిరంజీవి తో రిలేషన్ అయితే, రెండవ కారణం బన్నీలో వున్న ఎనర్జీ లెవెల్స్ అండ్ అందరితో కలుపుకు పోయే స్వభావం. ఆ తర్వాత అల్లు అరవింద్ సపోర్ట్ బాగా యాడ్ అయ్యింది.

అల్లు శిరీష్ మాత్రం పూర్తిగా అల్లు అరవింద్ ప్లానింగ్ మీదే ఆధారపడి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఎందుకంటే వారసులతో ప్రేక్షకులు విసిగి చెంది వున్నారు. చిరంజీవి కుటుంబానికి చెందిన వాడని జనాలు చూడరు. బన్నీ తో పొలిస్తే తెరపై ఎనర్జీ లెవల్స్ లేనట్టుగానే వుంటాడు.

ముందుగా అనుకున్న ప్రకారం సంక్రాంతి సీజన్ తర్వాత అల్లు శిరీష్ ‘గౌరవం’ రిలీజ్ అవ్వాలి. కాని చాలా సినిమాలు రిలీజ్ అవుతుండటం వలన ఈ సినిమాకు రైట్ రిలీజ్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఎంటర్ టైన్ మెంట్ సినిమా లేదా మాస్ సినిమా జెనర్ కు చెందిన చిత్రం ఎంచుకోకుండా ఒక వైవిధ్యమైన చిత్రంతో అల్లు శిరీష్ పరిచయం కావడం ఈ సినిమా ప్రత్యేకత. సినిమా కథ బాగుండి , సినిమా హిట్ టాక్ సంపాధించుకుంటే ఆటోమేటిక్ గా అల్లు శిరీష్ హీరోగా సెటిల్ అయిపోయినట్టే.

Filed Under: Mega FamilyFeatured