ఫ్యాన్స్‌నే బ్లేమ్ చేస్తారు

AA-PAWAN

మెగా ఫంక్షన్స్‌కు పవన్‌కల్యాణ్ రావడానికి ఇష్టపడడు. తన సినిమా ఫంక్షన్స్‌కు కూడా తప్పదన్నట్టు వస్తాడు. పవన్‌కల్యాణ్‌ను అమితంగా ఇష్టపడే మెగాఫ్యాన్స్ “పవర్‌స్టార్ పవర్‌స్టార్” అని అరవడం ఎప్పటినుండో వుంది. అప్పట్లో చిరంజీవి పవన్‌కల్యాణ్ గురించి ఎదో చెప్పి చాలా ఎంకరేజ్‌గా మాట్లాడి, అభిమానులను శాంతపరిచే వాడు. “పవర్‌స్టార్ పవర్‌స్టార్” అని అరవడం ఈ మధ్య ఒక నేరంగా చూస్తున్నారు. అలా అరవడం నాగేంద్రబాబు మెగాస్టార్‌కు అవమానంగా భావించి, అలా అరిచే వాళ్ళతో పాటు, పవన్‌కల్యాణ్‌ను కూడా ఒక మెగాఫంక్షన్‌లో దులిపేసాడు. పవన్‌కల్యాణ్ కంటే పెద్దోడు, పవన్‌కల్యాణ్ సొంత అన్నయ్య కాబట్టి చెల్లుబాటు అయిపోయింది.

ఒకప్పుడు “మీరు ఏం అడుగుతున్నారో నాకు వినపడుతుంది .. పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడకుండా నన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వరని తెలుసు .. పవర్‌స్టార్ రియల్‌స్టార్” అని చెప్పిన బన్ని, రీసెంట్‌గా “చెప్పను బ్రదర్” అని అనటంతో పవన్‌కల్యాణ్‌ను అభిమానించే మెగాఫ్యాన్స్ చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. తెలియనితనంతోనో, పవన్‌కల్యాణ్‌ను ఇష్టపడే మెగాఫ్యాన్స్ అల్లరి మరీ ఎక్కువ అవుతుందని ఫీల్ అయ్యి అలా అని వుంటాడులే అని మెగాఫ్యాన్స్ పెద్ద ఫీల్ అవ్వలేదు. సరిదిద్దుకుంటాడులే అని అనుకున్నారు. అలా ఎందుకన్నారని మీడియా ప్రశ్నిస్తే, “ఇప్పుడే అదే మాట .. నేను చెప్పను .. వేరే ప్రశ్న అడగండి” మరోసారి నొక్కివక్కాణించాడు. అల్లు అర్జున్ కుళ్ళుబోతోడు అని తెలుసు కాని, మరీ సొంతఫ్యామిలీ వాళ్ళపైనే ఇంత కుళ్ళుబోతుతనం పెట్టుకున్నాడా అని మెగాఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

“చెప్పను బ్రదర్” కు రిప్లైగా “చూసుకుంటాం బ్రదర్” “అల్లు అర్జున్‌ను సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఫాలో కాకండి .. సినిమాలు చూడకండి” అని మెగాఫ్యాన్స్ మొదలుపెట్టారు.

అన్నయ్య చిరంజీవిని మాత్రమే కాకుండా, “రామ్‌చరణ్” పిల్లోడు అని ఇంగిత జ్ఞానం లేకుండా అనరాని మాటలు అనే దాసరి నారాయణరావునే క్షమించేసి, సినిమా చేస్తున్న పవన్‌కల్యాణ్, ఈ విషయాన్ని అసలు పట్టించుకోడు అని అందరికీ తెలుసు.

bottomline:
సున్నితంగా డీల్ చేయవలసిన అంశాలను డీల్ చేయలేక, నోరు జారిన అల్లు అర్జునే కరెక్ట్ అంటూ, చివరికి ఫ్యాన్స్‌నే బ్లేమ్ చేస్తారు. కాకపొతే, ఈ ఎపిసోడ్‌తో అల్లు అర్జున్ అంటే విరక్తి కలిగిన మెగాఫ్యాన్స్, అల్లు అర్జున్ పబ్లిక్‌గా సారీ చెప్పినా క్షమించరు.

పవన్‌కల్యాణ్ గురించి ఒక ముక్క మాట్లాడేస్తే పొయే చిన్న విషయాన్ని ఇంత రాద్దాంతం చేసుకొవాల్సిన అవసరం వుందా అని అల్లు అర్జున్‌కు అల్లు అరవింద్ అయినా చెపితే బాగుండేది. మెగాఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టి, అల్లు ఫ్యాన్స్ అని వేరేగా క్రియేట్ చేసుకుందాం అనే దురాలోచనతో కూడిన పెద్ద వ్యూహం ఏదైనా వుండివుంటే, ఎవరేమిటనేది కాలమే సమాధానం చెపుతుంది.

Filed Under: సరైనోడు

commentscomments

 1. Pawan says:

  Hi Hari garu…

  Could you please let me know, what is the necessity for Exclusive Pawan Only fans, made Prabhas to speak about Powerstar?

  Everybody knows, Prabhas didn’t love Powerstar. But just for fans sake he said like that, words didn’t come from his heart.

  Let celebrities talk about POWESTAR by their own wish, but not by somebody’s force.

  Are you expecting our POWESTAR needs this type of false compliments (in general word Biscuits)?

 2. Hari says:

  Pawan,

  ఒకటి అర్దం చేసుకొవాలి. నేను నాలానే ఆలోచించగలను. నా కోణంలోనే వ్యక్తపరచగలను. నేను తప్పు అనిపించినపుడు, ఒప్పుకొవడానికి ఎటువంటి ఇగో లేదని ఫీల్ అవుతూ వుంటాను.

  ఈసైటు ద్వారా “నిజం” చెప్పాలన్నదే లక్ష్యం. నిజం అంటే నాకు తెలిసిన నిజం. నేను నమ్మిన నిజం. నా ప్రపంచంలోని నిజం.

  ఈ సైటు నేను మెయింటేన్ చేస్తున్న మాత్రానా నాది అని నేను ఎప్పుడూ అనుకొలేదు. అనుకోను. పవన్‌కల్యాణ్‌ను అభిమానించే ప్రతి ఒక్కరికి ఈ సైటుపై హక్కులు వున్నాయి. మీరు అడిగిన ప్రశ్నకు నా కోణంలో సమాధానం చెప్పగలను. కొందరికి తప్పు అనిపించవచ్చు. కొందరికి ఒప్పు అనిపించవచ్చు. ఎక్కువమందికి తప్పు అనిపించిన రోజు సైటు క్లోజ్ చేయడం మినహా చేసేది ఏమీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *