“అత్తారింటికి దారేది?” లక్ష్యం “ఓవర్ సీస్” కలక్షన్స్ రికార్డ్

pawan

సినిమా గ్రాస్ వేరు .. సినిమా షేర్ వేరు .. సినిమా పబ్లిసిటి కోసం షేర్ & గ్రాస్ ఎదో తెలియకుండా మిక్స్ చేసేసి మాది గొప్ప గొప్ప అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పు కోవడం మామూలే ..

నా పరిధిలో అమెరికాలో ప్రభంజనం సృష్టించిన కొన్ని రీసెంట్ సినిమాలు ..

మగధీర
దూకుడు
గబ్బర్ సింగ్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
బాద్ షా

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” నుండి కొత్త ట్రెండ్ మొదలయ్యింది .. కలక్షన్స్ అఫీషియల్ గా రికార్డ్ చేసి ఆన్ లైనులో వుంచగల ధియేటర్స్ లోనే మాక్సిమమ్ రిలీజ్ చేస్తున్నారు .. ఈ విధంగా చూస్తే, USA లో కలక్షన్స్ పరంగా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” నెం 1 మూవీ. బాద్ షా నెం 2 అనుకుంట.

త్రివిక్రమ్ దర్శకుడు .. పవన్ కళ్యాణ్ హిరో .. ఫ్యామిలీ ఎంటరటైనర్ .. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” కొట్టగల సత్తా వున్న కాంబినేషన్ మూవీ “అత్తారింటికి దారేది?” ..

కొడుతుందో లేదో .. ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో తెలియాలంటే ఆగష్టు 7 దాకా ఆగాల్సిందే ..

Filed Under: Pawan KalyanFeatured