వంద కోట్లు

Pawan Kalyan

సినిమా ట్రేడ్ అంటే ఎవరి లెక్కలు వాళ్ళవి. నిజం లెక్కలు ఎవరూ బయటపెట్టరు. ఒకరి లెక్కలు మరొకరు ఎగతాళి చేస్తారు. అభిమానుల లెక్కలు మరీ కామెడీగా వుంటాయి. కాబట్టి, పవన్‌ఫ్యాన్స్.కామ్ సినిమా కలక్షన్స్ పబ్లిష్ చెయ్యదు. ఇక్కడ చెప్పే లెక్కలు కూడా ఊహాగానాలుగానే భావించాలని విన్నపం.

అత్తారింటికి దారేది సినిమా అన్ని చోట్ల ఒకటే టాక్ .
సూపర్ హిట్.
లాస్ట్ 10 మినిట్స్ పవన్‌కల్యాణ్ కంటతడి పెట్టించాడు.
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ.
కొందరికి కొన్ని సీన్స్ అనవసరం అనిపించినా, కైమాక్స్ చూసాక అవన్నీ మరిచి పోయి, మంచి ఫీల్‌తో బయటకు వచ్చి, మరోసారి చూడటానికి ప్లాన్ చేసుకుంటారు.

కొందరు గబ్బర్‌సింగ్ ను కొట్టడం కష్టం అంటున్నారు. టాప్ 3.

కొందరు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తక్కువ అంచనా వేయవద్దు. కచ్చితంగా టాప్ 2 లో వుంటుందంటున్నారు.

మరికొందరు థియేటర్స్‌లో జనాలకు పూనకాలు వచ్చేస్తున్నాయి. మొదటి వంద కోట్లు తెలుగు సినిమా అవుతుందంటున్నారు. టాప్ 1.

చూడాలి ఏమవుతాదో!

పవన్‌కల్యాణ్ చెప్పాలనుకునే సినిమా లైను బాగుంటుంది కాని,
అది డైరక్టర్ అర్దం అయ్యి తెర మీదకు వచ్చేసరికి,
పవన్‌కల్యాణ్ లైను రూపే మారిపొవడమో,
అసలు లైనే మిస్ అవ్వడమో జరుగుతూ వుంటుంది.

అలా కాకుండా
పవన్‌కల్యాణ్ పవన్‌కల్యాణ్‌ను అర్దం చేసుకునే దర్శకుడు చేతిలో పడితే, దాని అవుట్‌పుట్ “అత్తారింటికి దారేది”. ఈ మ్యాజిక్ అన్నీ సార్లు జరగపోవచ్చు కానీ, ఈసారి భారీగా క్లిక్ అయ్యింది.

Just Thanks is not enough for Trivikram Srinivas.

Filed Under: Pawan KalyanFeatured