“అత్తారింటికి దారేది?” ఆడియో ఫంక్షన్ వుంటుందా? వుండదా?

Attarintiki Daredi

రామ్ చరణ్ రెండు సినిమాలు “ఎవడు” & “జంజీర్” రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయిపొయాయి.

పవన్ కళ్యాణ్ సినిమా “అత్తారింటికి దారేది?” కూడా ఇంచుమించు రెడీ అయిపోయింది. కాని టైటిల్ తో సహా ఏమీ ఫిక్స్ అవ్వలేదు. అందరివి ఉహాగానాలే.

“ఎవడు” జూలై చివరి వారంలో రిలీజ్ అవబోతుందని నిర్మాత దిల్ రాజు ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. “జంజీర్” అందరూ ఎక్సపెట్ చేసినట్టు అక్టోబర్ లో కాకుండా, సెప్టెంబర్ 6 న రిలీజ్ అని ఎనౌన్స్ చెయ్యడం వలన, “అత్తారింటికి దారేది?” అక్టోబర్ దాకా ఆపలేరు కాబట్టి, ఆగష్టులో రిలీజ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది.

“అత్తారింటికి దారేది?” రిలీజ్ అవ్వాలంటే, ఆడియో ఈ నెలలో ఆడియో రిలీజ్ చెయ్యాలి. జూలై 14 అని ప్రచారం జరుగుతుంది. But I doubt.

ఆడియో రిలీజ్ ఎప్పుడనేది పక్కన పెడితే, “అత్తారింటికి దారేది?” ఆడియో ఫంక్షన్ వుంటుందా? వుండదా? అనేది పెద్ద ప్రశ్న.

వుంటుందా? వుండదా? అనేది కూడా పక్కన పెడితే, వుండాలా వద్దా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఒక అభిప్రాయం: అభిమానులను ఇబ్బందులు పెడుతూ రొటీన్ రికార్డింగ్ డాన్స్ & ఓవర్ డోస్ పొగడ్తలు కోసం ఆడియో ఫంక్షన్ చెయ్యడం అవసరం లేదు.

ఇంకో అభిప్రాయం: సినిమా అభిమానులు, సినిమా పిచ్చోళ్ళు సినిమా న్యూస్ రోజూ ఫాలో అవుతారు కాబట్టి, ఆడియో ఫంక్షన్ వున్నా లేకపోయినా పర్వాలేదు.అందరికీ తెలియాలంటే ఆడియో ఫంక్షన్ చాలా అవసరం. చేస్తే సినిమాపై వచ్చే హైపే వేరు.

అభిప్రాయాలు ముఖ్యం కాదు, ఆడియో ఫంక్షన్ పై పవన్ కళ్యాన్ డెసిషన్ ఏమిటి? “అత్తారింటికి దారేది?” టైటిల్ ఫైనాలా? రిలీజ్ ఎప్పుడు ? అనే ప్రశ్నలకు జవాబు త్వరలోనే తెలుస్తుందని ఆశీద్దాం. పవన్ కళ్యాణ్ సినిమా కోసం సంవత్సారాలు సంవత్సరాలే ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అంతా రెడీ అయిపోయిన సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయలేమా?

Note: above picture is taken from google search and credit goes to original creator. (same note applies to most of the pictures in this site)

Filed Under: Pawan KalyanFeatured