నేడే “అత్తారింటికి దారేది” ఆడియో విడుదల

attarrintikidaaredi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ ఆడియో రోజు హైదరబాద్లో శిల్పకళావేదికలో ఘనంగా విడుదల కానున్నది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ సినిమాలో పవన్ సరసన సమంత ప్రణీతలు హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఈ సంగతులు మనకు తెలిసిందే.

ఈ ఆడియో వేడుకకు తక్కువ పాస్ లు అనుమతిస్తున్నారు నిర్వాహకులు. ఇక్కడే అసలు ప్రొబల్మమ్స్ బయట పడ్డాయి.

పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభిమానుల సంఘం లీడర్స్ ను ఎంకరేజ్ చెయ్యడు. తన ఫంక్షన్స్ కు అభిమానులు అవసరం అయితే చిరంజీవి సంఘం లీడర్స్ మీదే ఆధార పడతాడు. ఆ సంఘం లీడర్స్ రెగ్యులర్ గా టచ్ లో వుండే అభిమానులకే ప్రాదాన్యత ఇస్తారు. సామాన్య అభిమానులకు ఆడియో పాస్ లు అందవు. అది కొత్తేమి కాదు. ఈసారి ఆడియో పాస్ లు తగ్గించ్చేయడంతో, సెకెండ్ లేయర్ కు అందక పోవడంతో, వాళ్ళ ఆవేదన బయట పడింది.

ఆడియో ఫంక్షన్ ఇష్టం లేకపోయినా, కేవలం సినిమా పబ్లిసిటికి ఎంతో అవసరం కాబట్టి ఆడియో ఫంక్షన్ ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా వుంటుందో.

Filed Under: Pawan KalyanFeatured