రేపే ‘అత్తారింటికి దారేది’ ఆడియో విడుదల

Kollection_72

రోజూ ఎదోకటి వ్రాయడం పెద్ద ఛాలెంజ్ అయితే, వ్రాసిన దానికి ఫొటో సెలెక్ట్ చెయ్యడం మరో పెద్ద ఛాలెంజ్. ధరణీ గారు సరదాగా సినిమాలపై కార్టున్స్ వేస్తూ వుంటారు.(click here for more) ఈసారి అక్కడ నుంచి ఎత్తుకొచ్చా అన్నమాట. మీరు కూడా సరదాగా తీసుకుంటే సరి. (మీ మనోభావాలు దెబ్బతింటే ఆయన్ని తిట్టుకొండి. చివర ‘చౌదరి’ అని తోక కూడా వుంది. Just Kidding 🙂 )

ఎవడు జూలై 31 కనఫార్మ్. ఎవడు కు బడా నిర్మాత దిల్ రాజుకు మరో బడా నిర్మాత అల్లు అరవింద్ కూడా డిస్ట్రిబ్యూషన్ లో తోడయ్యాడు కాబట్టి, మన అత్తారింటికి దారేది సినిమాకు మంచి ధియేటర్స్ దొరుకుతాయో లేదొ అని కొందరు అభిమానులు బెంగ పెట్టుకున్నారు. థియేటర్స్ గొడవ లేకుండా మన అత్తారింటికి దారేది సినిమా ఒక వారం వాయిదా వేసుకుంటే సరి అని కొందరు అభిమానులు కోరుకుంటున్నారు. కాని మన ప్రొడ్యుసర్ BVNS ప్రసాద్ మీడియాను కలిసిన ప్రతిసారి ఆగష్టు 7 రిలీజ్ అని రీకనఫార్మ్ చేస్తున్నాడు. ఈ కోణంలో పై ఫోటో కామెంట్ బాగా ఆప్ట్ అవుద్ది.

రేపే ‘అత్తారింటికి దారేది’ ఆడియో విడుదల. దేవిశ్రీ ప్రసాద్ & పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో అల్భం. ఫస్ట్ ఆడియో జల్సా బెస్ట్ అల్భం. సెకెండ్ ఆడియో గబ్బర్ సింగ్ దానిని రీచ్ అవ్వలేదు .. సినిమా హిట్ అయ్యింది కాబట్టి ‘గబ్బర్ సింగ్ ఆడియో కూడా జల్సా ఆడియోకు ధీటుగా వుందనిపిస్తుంది. ‘అత్తారింటికి దారేది’ రొటీన్ గానే వుంటుందని ఎక్సపెట్ చేస్తున్నా. Stop here and Lets wait for tomorrow.

Filed Under: Pawan KalyanFeaturedJust4Fun