అత్తారింటికి దారేది ఆడియో రివ్యూ

audio-atharintikidaaredi

“జల్సా” & “గబ్బర్ సింగ్” అంత లేకపోయినా, “అత్తారింటికి దారేది” ఆడియో ఇనిస్టెంట్ హిట్ అల్భం. ఐదు పాటల్లో ఇనిస్టెంట్ గా ఎవరికైనా మినిమమ్ మూడు సాంగ్స్ నచ్చుతాయి.

1) వీడరడుగుల బుల్లెట్టు: ఒన్ మినిట్ ప్రోమో సాంగ్ రిలీజ్ చెసినప్పుటి నుంచే సూపర్ లిరిక్స్ .. సూపర్ హిట్ సాంగ్ ఆఫ్ అల్భం.
2) నిన్ను చూడగానే: దేవిశ్రీ ప్రసాద్ బద్దకంగా పాడిన సాంగ్. బద్దకంగా పాడటం అనేదే ఈ సాంగ్ కాన్సప్ట్. మధ్యలో వచ్చే బీట్స్ అదిరిపోయాయి .. పిక్చరైజేషన్ పిచ్చేక్కేసి వుంటాడు .. బహుశా హౌస్ సెట్ లో తీసిన సాంగ్ లా వుంది ..
3) బాపు గారి బొమ్మ: శంకర్ దేవన్ వాయిస్ .. లిరిక్స్ కూడా అదిరిపోయాయి .. విదేశాల్లో ప్రణీత మీద తీసినట్టు వున్నారు ..
4) కిర్రాక్క్: విదేశాల్లో సమంతా మీద తీసిన సాంగ్ అనుకుంట .. రిపీట్ హియరింగ్ లో బాగుంది .. సినిమా వచ్చాక ఇంకా బాగుండే సాంగ్ లా వుంది
5) Time to Party: Party Song. OK
6) Bit Song: OK

గబ్బర్ సింగ్ తో ఫామ్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ తోడయ్యి, ఫ్యామిలీ విలువలకు సంబంధించిన సబ్జక్ట్ కావడంతో, అమెరికాలో థియేటర్లో చూడటానికి చాలా మంది ప్రిపేర్ అయిపోయారు .. ఈ ఆడియో తో ఫుల్ కనఫార్మ్ అయిపోయారు ..

Filed Under: Pawan KalyanFeatured