అత్తారింటికి దారేది అక్టోబర్‌లో

Pawan

ఆగష్టు 7
ఆగష్టు 9
ఆగష్టు 14
ఆగష్టు 21
సెప్టెంబర్ 13
సెప్టెంబర్ 20
సెప్టెంబర్ 27

ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన డేట్స్ వాళ్ళు గెస్ కొడుతూ వస్తున్నారు. మన టి.వి 9 లేటేస్ట్ గెస్ ప్రకారం అత్తారింటికి దారేది సెప్టెంబర్‌లో రానట్టే. అత్తారిటికి దారేది, రామయ్యా వస్తావయ్యా! & భాయ్ .. ఈ మూడు సినిమాలూ అక్టొబర్ అని గెస్ కొడుతున్నాడు.

—–
మేము విడిపొతాం మొర్రో అనో .. మీరు మమ్మల్ని వదిలి పొండ్రో అనో .. అని పచ్చి బూతులు తిడుతుంటే .. ఇంకా మనం కలిసుందాం అని ఒక ప్రాంతం వాళ్ళు మాత్రమే అనడంలో ఏమైనా అర్దం వుందా?

అభివృద్ది చెందిన హైదరాబాద్ తెలంగాన ప్రాంతంలో వుంది కాబట్టి, వాళ్ళు ప్రత్యేక తెలంగాన కోరుకొవడంలో అర్దం వుంది ..

మాది అనుకున్న యాభై ఏడేళ్ళ రాజధాని హైదరాబాద్ మీకెలా ఇచ్చేస్తాం అని పొరాడకుండా, సమైక్యాంధ్ర అని సీమాంధ్ర మోసగాళ్ళు(నాయకులు) & పనికిమాలిన మేధావులు .. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. సమైక్య నినాదం ఒక పచ్చి మోసం. సమస్య మనం సృష్టించుకొని సోనియా గాంధీని ఆడిపోసుకొవడం మరీ విచిత్రం.

మరో పక్క, హైదరాబాద్‌తో కూడిన తెలంగాన మాత్రమే మాకు కావాలి అని తెలంగానకు చెందిన అబద్దాల నాయకులు & మూర్ఖపు మేధావులు .. (ఈ ఇష్యూ క్లోజ్ అయిపొతే వీళ్ళకు పని వుండదు కదా!)

హైదరాబాద్‌పై ఒక అంగీకారానికి వచ్చి, విడిపోకుండా .. ఈ సాగతీతుడు ఏమిటో? ఎటూ తేలకుండా సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు .. అబద్దాలు చెప్పే నాయకులు .. మోసాలు చేసే నాయకులు తప్ప .. మన రాష్ట్రంలో నిజం మాట్లాడే నాయకుడే లేడు. పొరబాటున మాట్లాడినా, వాడి గొంతు వినిపించకుండా లుచ్చా నాయకులు డామినేట్ చేసేస్తారు.

Filed Under: Pawan KalyanFeatured