ఎక్కడ నెగ్గాలో కాదు .. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు .. గొప్పోడు

TS

అత్తారింటికి దారేది సినిమా విజయానికి బలం లేడీస్‌ను ఆకట్టుకోవడంతో పాటు పూర్తి వినోదాత్మకంగా కథనం సాగడం. కాని డైలాగ్స్ పరంగా చాలా మంది త్రివిక్రమ్ అభిమానులని నిరాశ పరిచిన సినిమా ఇది అని అంటున్నారు. కొన్ని చోట్ల అనవసరమైన డైలాగ్స్ పెట్టి కొన్ని సీన్స్ బలహీన పడేలా చేసాడని వారి అభిప్రాయం. లాస్ట్ లో 10 మినిట్స్ సెంటిమెంట్ సీను అవి మరిచిపొయేలా చేసిందనుకోండి.

10 మినిట్స్ సెంటిమెంట్ సీను అయిపొయాక పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి యం.యస్ నారాయణ క్రింది డైలాగ్ అంటాడు.

ఎక్కడ నెగ్గాలో కాదు .. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు .. గొప్పోడు

—యం.యస్ నారాయణ

ఇదే డైలాగ్‌ను తనకు తానే అన్వయించుకొని, ఇప్పటి దాకా తన డైలాగ్స్‌కి తనకు తానే ఫైనల్ డిసైడర్‌గా వ్యవహరించిన త్రివిక్రమ్, ఒక మంచి సలహా దారుని పెట్టుకొని డిస్కస్ చేసి ఫైనల్ చేసుకుంటే మంచిదంటున్నారు. అలా చేయడం ద్వారా తన డైలాగ్స్‌లో జ్యూస్ అయిపోయినట్టుగా కాకుండా, ప్రెష్ ఫీలింగ్ వచ్చే అవకాశం వుందంటున్నారు.

Filed Under: Pawan KalyanFeatured