అత్తారింటికి దారేది exclusive review

Pawan Kalyan

సినిమా ఎలా వుంది?
సినిమా సూపర్ హిట్ టాక్ నడుస్తుంది. కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది. నిర్మాతకు త్రివిక్రమ్ శ్రీనివాస్ & పవన్‌కల్యాణ్ రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వవలసిన పని లేదు.

ఎవరేజ్ కంటెంట్‌కు పవన్‌కల్యాణ్ ఫార్మ్ & త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాజిక్ కలిసి సూపర్‌హిట్ అయ్యేలా చేసాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్‌కల్యాణ్ లోని కొత్త కొణాన్ని ఏమీ అవిష్కరించ లేదు కాని, పవన్‌కల్యాణ్‌ను కరెక్ట్‌గా వాడుకొన్నాడు. చిన్న సెంటిమెంట్ కథకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎపిసోడ్స్‌తో గ్యాప్స్ ఫిల్ చేసి ఎక్కాడా బోర్ లేకుండా నిర్మించిన చిత్రం.

సూపర్ హిట్ టాక్ చూసి ఎక్కువ ఎక్సపెటేషన్స్ పెట్టుకోకుండా చూస్తే, ఫస్ట్ నుంచి చివరి దాకా ఫుల్ ఎంజాయ్ చేసే సినిమా. లాస్ట్ 10 మినిట్స్ పవన్ కల్యాణ్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది.

పవన్‌కల్యాణ్ ఎలా చేసాడు?
గుడుంబా శంకర్ కోసం పవన్‌కల్యాణ్ రెండు మూడేళ్ళు రేయింబవళ్ళు ఆ సినిమా రైటర్స్ & దర్శకుడితో కలిసి కష్టపడి పని చేస్తూ నటించాడు. ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమాకు కేవలం నటనకే పరిమితం అయ్యాడు. He did his job nicely.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ ఎలా వుంది?
సంభాషణల్లో పదును తగ్గింది. సెంటిమెంట్ సీనులో కుడా ప్రాస కోసం ప్రాకులాడటం బాగోలేదు. ఎవరిదైన సహాయం తీసుకుంటే బాగుంటుంది. ఈ లోపాలు పెద్దగా ఇబ్బంది పెట్టేవి కావు అనుకోండి.

చిన్న సెంటిమెంట్‌ను రెండున్నర గంటలు పైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో నడిపించాడు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్స్ & ఫైట్స్ బాగా డిజైన్ చేసాడు. He is Genius.

ఎవరికి బాగా నచ్చుతుంది?
లేడీస్‌కు బాగా నచ్చుతుంది. మేము వెళ్ళిన షోలో, సినిమా రెండున్నర గంటలు పైనే వున్నా, సినిమా అయిపొయిన తర్వాత కూడా జనాలు సీట్లు లోంచి లేవడం లేదు.

వంద కోట్లు సాధిస్తుందా?
ఓవర్‌సీస్‌లో నెం 1 మూవీ. Its Official.

చాలా గ్యాప్ తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన సెంటిమెంట్ మూవీ రావడంతో, అన్ని వర్గాల ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తుంది.

రిలీజ్‌కు ముందే ఫస్టాఫ్ పైరసీ రిలీజ్ అయిపొవడంతో, ఇటు మీడియాలో అటు ప్రేక్షకుల్లో మంచి సానుభూతి సంపాదించుకొవడం సినిమాకు పెద్ద ప్లస్. ఆ సానుభూతి వలన చందా రాయుళ్ళు కూడా కనికరించారు.

లేడీస్‌కు బాగా నచ్చే సినిమా కావడంతో పాటు, రిపీట్ ఆడియన్స్ బాగా వుండే సినిమా కాబట్టి, పెద్ద రేంజ్ సినిమానే కాని, వంద కోట్లు రేంజ్ అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. గబ్బర్‌సింగ్ ను కచ్చితంగా క్రాస్ చేస్తుందని మాత్రం చెప్పవచ్చు.

Filed Under: Pawan KalyanFeaturedHari Reviews