రొటీన్‌గానే ‘అత్తారింటికి దారేది’ కథ

attarrintikidaaredi

సినిమాను హైప్ చెయ్యడానికి, సినిమా రిలీజ్ కు ముందు “మా సినిమా కథ అద్భుతం, అత్యద్భుతం” అని పొరబాటున కూడా ప్రచారం చెయ్యకూడదు. ఎందుకంటే ప్రేక్షకులకు అలా అనిపించక పోవచ్చు. అల్లు అర్జున్ ‘బద్రీనాధ్’ బెస్ట్ ఎక్సాంపుల్. అదే పొరబాటు ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకు చేసారు. ఇప్పుడు ‘ఎవడు’ కు చేస్తున్నారు. రాజమౌళి సినిమాలు ‘మగధీర’ & ‘ఈగ’ మాదిరి నిజానికి కథ ఇది అని చెప్పేస్తే బెటర్. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ కథ కూడా అందరికీ తెలిసిందే.

‘అత్తారింటికి దారేది’ సినిమా కథపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అందులో ఒకటి:

విదేశాల్లో ఉన్న ప‌వ‌న్‌ ఓ మిలియ‌నీర్ అట‌. ఇండియాలో త‌న‌కు ఓ అత్తమ్మ ఉంద‌ని, ఆ కుటుంబంతో ఎన్నో యేళ్లుగా విభేదాలున్నాయ‌ని తెలుస్తుందట. తాత‌య్య బొమ‌న్ ఇరానీ ద‌గ్గర అనుమ‌తి తీసుకొని అత్తారింటికి దారేది అంటూ వెతుక్కొంటూ ఇండియా వ‌స్తాడు. ఇక్కడ స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు.ఇంత‌కీ స‌మంత ఎవ‌రో కాదు.. అత్తమ్మ కూతురే. అత్తమ్మగా న‌దియా నటిస్తుంది.

అత్తమ్మ న‌దియా ఇంట్లో ప‌వ‌న్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తాడ‌ట‌. మ‌రి అన్ని కోట్లుండి ఓ డ్రైవ‌ర్‌గా ఎందుకు ప‌నిచేయాల్సి వ‌చ్చింది? అస‌లు ఎందుకొచ్చాడ‌నేదే ఈ సినిమా క‌థ‌.

Filed Under: Pawan KalyanFeatured