ఇండ స్ట్రీ హిట్ దిశగా “అత్తారింటికి దారేది”

PAWAN KALYAN

“అత్తారింటికి దారేది” సూపర్‌హిట్ టాక్‌కు సానుభూతి తోడై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. లేడిస్‌కు సినిమా బాగా ఎక్కడంతో ఇండ స్ట్రీ హిట్ దిశగా “అత్తారింటికి దారేది” దూసుకెళ్ళి పోతుంది.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాకు మొదటి నుంచి ఇబ్బందులు తోడయ్యాయి. సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల కారణంగా సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారు. తర్వాత ధైర్యం చేసి దసరా సందర్భంగా విడుదల అని ప్రకటించారు. విడుదల చేస్తామనుకున్న సమయంలో, పైరసీ బయట పడటంతో అనుకున్న తేది కంటే ముందే రిలీజ్ చేసారు. కలక్షన్స్ ఇక అంతే సంగతులు అనుకున్నారు.

కానీ అందరి అంచనాలను మించి ఈ సినిమా ఇప్పుడు రికార్డులను తిరగరాస్తోంది.

Filed Under: Pawan KalyanFeatured