అత్తారింటికి దారేది ‘థాంక్యూ మీటింగ్’

Screen Shot 2013-10-12 at 12.44.33 PM

అత్తారింటికి దారేది సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. అంటే సినిమాలోవిషయం లేదని కాదు, సినిమా కచ్చితంగా ఫ్యామిలీ మొత్తం కలిసి అసలు ఇబ్బంది లేకుండా చూడదగిన సినిమా. ఇప్పటికే గబ్బర్‌సింగ్ ను దాటేసిందని అంటున్నారు. మగధీరను కూడా దాటేయవచ్చని, మొదటి వంద కోట్ల తెలుగుసినిమా అని మొదట్లో అంచానా వేసారు. పూర్తి రన్ అయిన తర్వాత తెలుస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్లకు, మీడియా సమావేశాలకు ఆమడ దూరంలో ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఈ సారి అందుకు భిన్నంగా ‘అత్తారింటికి దారేది’ చిత్రం సక్సెస్ అండ్ థాంక్యూ మీటింగులో పవన్ కళ్యాణ్ పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. గత వారంమే ఈ మీటింగ్ జరుగాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది.

క్లిష్ట పరిస్థితుల్లో విడుదలైన ఈచిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైన సంగతి తెలిసిందే. అయినా సరే ప్రేక్షకులు సినిమాను భారీగా విజయవంతం చేసారు. ఈ నేపథ్యంలో ప్రేక్షక దేవుళ్లకు, అభిమానులకు థాంక్స్ చెప్పేందుకు భారీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.

విడుదలకు ముందే విడియో రిలీజ్ చేసినోడి కాళ్లకు దండం పెట్టుకోవచ్చు నిర్మాత. విజయోత్సవ సభలకు దూరంగా వుండే పవన్‌కల్యాణ్ కూడా బయటకు వస్తున్నాడు. విడుదలకు ముందే విడియో రిలీజ్ చేసినోడికి పవన్ అభిమానులందరూ ఋణపడి వుంటారు.

వాడు చేసింది పెద్ద తప్పు అయినా, ఈసారికి వాడిని క్షమించి వదిలెయ్యాలని pawanfans.com కోరుకుంటుంది.

Filed Under: Pawan KalyanFeatured