‘అత్తరింటికి దారేది’ ఆగస్టు 7న రిలీజ్ అవుద్దా?

pawan

పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమాకు ప్రచారంలో ఉన్న పేరు ‘అత్తరింటికి దారేది’. ‘అత్తరింటికి దారేది’ అనే పేరును చిత్ర దర్శకనిర్మాతలు ఖరారు చేయాల్సి ఉంది. ఈ సినిమా హైదరాబాదు షెడ్యూలు ఈనెల 28తో ముగుస్తోంది. దీంతో చాలావరకు షూటింగు పూర్తవుతుంది. ఇంకా విదేశాలలో చిత్రీకరించవలసిన షూటింగ్ తో పాటు, ప్యాచ్ వర్క్ మరియు ఒక పాట హైదరాబాదులో చిత్రీకరించవలసి వుంటుంది.

విదేశాలలో షూటింగు కోసం సినిమా యూనిట్‌ ఈ నెలాఖరున స్పెయిన్‌ బయలుదేరి వెళుతోంది. స్పెయిన్‌, ఆస్ట్రియా, జర్మనీ దేశాలలో సుమారు నెలరోజుల పాటు జరిగే షూటింగులో బ్యాలెన్స్‌గా వున్న టాకీపార్టు, ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తారు. అలాగే, మూడు పాటల చిత్రీకరణ కూడా అక్కడే జరుగుతుంది. పవన్‌-సమంతాలపై ఒక పాటను, పవన్‌- ప్రణీతలపై మరోపాటను, పవన్‌పై ఒక సోలో సాంగునూ యూరప్‌ అందాల నడుమ షూట్‌ చేస్తారు.

లాస్ట్ మినిట్ లో ‘ఇద్దరమ్మాయిలతో’ కి ఐపియల్ అడ్డు వచ్చినట్టు వేరేవి అడ్డు రాకపొతే ‘అత్తరింటికి దారేది’ ఆగస్టు 7న రిలీజ్ అవ్వడానికి ఛాన్సస్ వున్నాయి. కాని రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాకు గ్యాప్ ఇవ్వడానికి ఈ సినిమాను రెండు మూడు వారాలు పొస్ట్ పోన్ చేస్తారనే భయం అభిమానులలో వుంది.

Filed Under: Pawan KalyanFeatured