భారీ బడ్జెట్, భారీ బిజినెస్, భారీ అంచనాలు – ‘బాద్ షా’

బాద్ షా

బాద్ షా

‘గబ్బర్ సింగ్’ సక్సెస్ తో టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ ప్రస్తుతం యంగ్ ఎన్.టి.ఆర్ తో ‘బాద్ షా’ & బన్నీ తో ‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమాలు చేస్తున్నారు.

‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమా వివరాలు ఏమీ బయటకు రావడం లేదు, కాని ‘బాద్ షా’ విశేషాలు బాగానే వస్తున్నాయి.

కెరీర్ బిగినింగ్ లోనే ఆది సింహాంద్రి సినిమాలు అప్పుడే చిరంజీవి, బాలకృష్ణలకు ధీటుగా కలక్షన్స్ సాధించాడు ఎన్.టి.ఆర్. ఈ మధ్య కాలంలో వచ్చిన అదుర్స్ బృందావనం సినిమాలు హిట్ అనిపించుకున్నా ఎన్.టి.ఆర్ స్టామినాకు తగ్గ భారీ కలక్షన్స్ సాధించచ లేదు.

స్టామినా వున్న హీరోకు ఫాంలో వున్న కమర్షియల్ దర్శకుడు తోడయ్యితే ఏమి జరుగుతుందో అదే ఇప్పుడు బాద్ షా కు జరుగుతుంది.

భారీ బడ్జెట్, భారీ బిజినెస్, భారీ అంచనాలు:
సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుండటంతో భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించిన బండ్ల గణేష్ సేఫ్ అయినట్టే. ఇక మిగిలిందల్లా భారీ అంచనాలు రీచ్ అవ్వడమే. అంచనాలు రీచ్ అయితే భారీ కలక్షన్స్ కూడా గ్యారంటీ అని వేరేగా చెప్పనవసరం లేదు.

శ్రీను వైట్ల కచ్చితంగా ఎంటర్ టైన్ మెంట్ పండిస్తాడు. దానికి తోడు యంగ్ ఎన్.టి.ఆర్ తన డాన్సస్ తో ప్రేక్షకులకు వినోదం అందిస్తే బండ్ల గణేష్ చెప్పినట్లు ‘బాద్ షా’ టాలీవుడ్ టాప్ 3 లోకి వచ్చేసినట్టే.

Filed Under: Extended FamilyFeatured