మగధీరకు ధీటుగా బహుబలి

prabhas-bahubali

ఎంత కాలం పడుతుందో తెలియదు కాని తెలుగుసినిమాను హలీవుడ్ స్థాయికి తీసుకొని వెళ్ళగల సత్తా వున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాన్

ఆ మాటలు పవన్ కళ్యాన్ ఏ సందర్భంలో అన్నాడో గుర్తు లేదు కాని, మన తెలుగుసినిమాను నేషనల్(బాలీవుడ్) లెవిల్ లో భారీగా తీసుకొని వెళ్ళడానికి ఇంకో దర్శకుడు మన రాజమౌళి రెడి.

మగధీర. ఇది రామ్ చరణ్ మూవీ అనే కంటే రాజమౌళి మూవీ అంటే చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. కారణం ఈ సినిమా కోసం రాజమౌళి పడిన కష్టం, సినిమాను పండించిన విధానం రామ్ చరణ్ ను డామినేట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా హిరో ప్రభాస్ అయితే ఇంకా బాగుండేది అనే మాటలు కూడా వినిపించాయి.

మగధీరకు ధీటుగా చాలా తెలుగుసినిమాలు అనగనగా ఒక ధీరుడు, శక్తి, బద్రినాథ్ & డమరుకం నిర్మింప బడ్డాయి కాని, ఏదీ వర్క్ అవ్వలేదు.

ప్రభాస్ హీరోగా రాజమౌళి భారీ బడ్జెట్ తో మూడు బాషలలో మగధీరకు ధీటుగా బహుబలి తీయడం ఆనందదాయకం. ఈ సినిమా కోసం 100 కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాతను రాజమౌళి ఎన్నుకున్నాడు. మగధీర, ఈగ సినిమాలతో రాజమౌళి సంపాదించిన గ్రాఫిక్స్ వర్క్ అనుభవంతో ఈ సినిమా తీయడం వలన, ఒక మంచి భారీ సినిమాను ఎక్సపెట్ చేయవచ్చు.

Filed Under: Extended Family