బాహూబలి ఆడియో ఫంక్షన్ రివ్యూ

audio-baahubali

ఫ్యాన్స్ కోసం పబ్లిక్ ఫంక్షన్ చేస్తున్నాం అనేది పచ్చి అబద్ధం. ఏ ఫంక్షన్‌కైనా గ్రాండ్ లుక్ రావాలంటే జనం వుండాలి. బాహూబలి సినిమాపై వున్న హైప్‌ను కంటీన్యూ చెయ్యడం కోసం మరింత గొప్పగా వుండాలి. ఫ్యాన్స్ కోసమే పబ్లిక్‌గా చేస్తున్నాం అనే అబద్ధం మినహా, “బాహూబలి” ఆడియో ఫంక్షన్ చాలా బాగుంది. ఓవర్ కంట్రోల్డ్ అనిపించినా ఒక పద్దతిగా జరిగింది.

  1. పబ్లిక్‌తో కలిపి, రాజమౌళి ఫ్యామిలి కొందరు అతిధులను పిలిచి వాళ్ళతో కలిసి చేసుకుంటున్న మ్యూజికల్ నైట్‌గా మొదలైంది
  2. రిలీజ్ డేట్ ఎప్పుడు .. ఎప్పుడు .. ఎప్పుడు .. అని ఫంక్షన్ అంతా పదే పదే రిపీట్ చేసి, “జూలై 10th” అని అందరికీ బాగా రిజిస్టర్ అయ్యేలా ఎనౌన్స్ చేసి, రిలీజ్ అవ్వకపొయినా ఆశ్చర్యపోవద్దు అని ప్రిపేర్ చేసారు.
  3. రానా, చరణ్ & అఖిల్ very well trained. ఎలా మాట్లాడాలో బాగా నేర్పించారు/నేర్చుకున్నారు. రానా స్పీచ్ ఆకట్టుకుంది.
  4. ప్రభాస్ & రాజమౌళి కష్టసుఖాలు పంచుకునే మంచి ఫ్రెండ్స్ అని జనాలందరికీ తెలిసింది. పవన్‌కల్యాణ్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలానో, ప్రభాస్‌కు రాజమౌళి అలా అన్నమాట.
  5. రాజమౌళి తండ్రి విజేంద్రప్రసాద్ స్పీచ్ హైలట్. చాలా ఇంటరెస్ట్‌గా సాగింది. (సోది చెపుతాడెమో అని భయపడ్డారు)
  6. బాహుబలి సినిమా హలీవుడ్‌లో ఎంత సమయం ఎంత బడ్జెట్ అవుతాదో రమ్యకృష్ణ బాగా చెపుతూ, ఇటువంటి సినిమాకు టైం కలిపించవలసిన అవసరం బాగా వివరించింది.
  7. ఎవరేమి మాట్లాడాలో కూడా రాజమౌళీ కంట్రోల్ చేస్తున్నట్టు అనిపించింది. బిగ్ సెలబ్రెటిలందరూ, ఒక హర్డ్ వర్కింగ్ టెక్నిషయన్‌కు గుర్తింపు కలిపించడం మరో బిగ్ హైలట్. అందరికీ నచ్చింది.
  8. అడివి శేషు స్పీచ్‌లో పవన్‌కల్యాణ్‌కు థాంక్స్ చెప్పినప్పుడు వచ్చిన రెస్పాన్స్ పవన్‌కల్యాణ్ క్రేజ్ మరోసారి తెలియజేసింది.

Filed Under: Featuredబాహుబలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *