“బలుపు” – Exclusive Review

balupu

“బలుపు” సినిమా ఎలా వుంది?
“తెలుగు ప్రేక్షకులు ప్రయోగాత్మక చిత్రాల కంటే కమర్షియల్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఇష్ట పడతారు” అని హిరో సిద్దార్ద అన్నాడు. అది 100% నిజం అని నిరూపించే సినిమా “బలుపు”. ఫస్ట్ నుంచి చివరి దాకా ఫుల్ ఎంటరటైనమెంట్. సెంటిమెంట్ కూడా బాగా పండింది. పక్కా కమర్షియల్ మూవీ.

పక్కా కమర్షియల్ మూవీ అంటే?
ఎంటరటైనమెంట్ ఎంటరటైనమెంట్ ఎంటరటైనమెంట్. ఎంటరటైనమెంట్ కోసం కథ.మూవీ లవర్స్ విమర్శకుల మాదిరి పనికిమాలిన రంధ్రాన్వేషణ చెయ్యకూడదు.

రవితేజ ఎలా చేసాడు?
ఎక్కడా ఓవర్ చేయ్యలేదు. అలా అని ఎక్కడా పంచ్ తగ్గ లేదు. బాగా చేసాడు.

మిగతా వాళ్ళల్లో ఎవరు బాగా చేసారు?
అందరూ బాగా చేసారు. ప్రకాష్ రాజ్ కు మంచి రోల్ అని చెప్పవచ్చు. శ్రుతీ హాసన్‌, అంజలి – ఇద్దరూ పాత్రల పరిధి మేరకు నటించారు. హీరో, లేదా విలన్‌ చేతిలో వట్టి బడుద్ధాయిగా మారి వారి చేతుల్లో దెబ్బలు తింటూ, తనవైన హావభావాలు పలికించడం బ్రహ్మానందానికి కొత్త కాదు, ఈ సినిమా బాగా వర్క్ అయ్యింది. సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ సావిత్రిగా అలీ కూడా బాగా చేసాడు.

సినిమా చూడవచ్చా?
రొటీన్ సినిమా అని ప్రిపేర్ అయ్యి చూస్తే, ఫస్ట్ నుంచి చివరి దాకా ఫుల్ ఎంటరటైనమెంట్. తప్పకుండా చూడవచ్చు.

Filed Under: FeaturedHari Reviews