‘బలుపు’ ఆ సీను బాలకృష్టను ఉద్దేశించ్చిందేనా?

balupu

గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి సీన్ బాగా అకట్టుకున్న పాట రాజశేఖర్ ‘రోజ్ రోజ్ రోజా పువ్వా’ సాంగ్ .. ఆ పాట రియాక్షన్ గా ‘ఏమి చేస్తిరి ఏమి చేస్తిరి’ అనే పవన్ కల్యాణ్ డైలాగ్. తెలుగు రాని తమిళ్ స్టైల్, అచ్చు రాజశేఖర్ లానే వుంది. చిరంజీవి ఫ్యామిలి అంటే విమర్శించడానికి రాజ శేఖర్ దంపతులు ముందు వుంటారు కాబట్టి, వారికి పవన్ కల్యాణ్ కౌంటర్ వేసినట్టుగా సరిపొయింది.

ఇప్పుడు అదే కొవలో బలుపు సినిమాలో ఒక సీనులో రవితేజ బాలకృష్ణను ఇమిటేట్ చేసాడంటున్నారు చాలామంది ప్రేక్షకులు.

ఏమిటా సీను?
హీరోయిన్‌ అంజలిని ఎట్రాక్ట్ చేసేందుకు… రవితేజ స్పీచ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఏం చెప్పాలో తెలీక తికమకగా గందరగోళ పడుతూ ఏదోదో మాట్లాడేస్తుంటాడు. పొంతన లేకుండా ఏదేదో చెప్పేస్తాడు. ఒక దశలో శ్రీకృష్ణ దేవరాయలు యుగానికి వెళ్ళిపోతాడు మాటల్లో.. ఇదంతా అచ్చు బాలకృష్ణ స్పీచ్‌లా ఉందే అనిపిస్తుంది.

సలు ఆ ఉద్దేశం లేదు, ప్రేక్షకులు అలా ఫీల్ అవుతున్నారంతే అని అంటారా? సరదా కోసం చేసారా? లేక ఉద్దేశ పూర్వకంగా చేసారా అనేది ‘బలుపు’ హిరో or దర్శకుడు చెపితే కాని తెలియదు.

Filed Under: Extended Family