Best Compliments from Pawan Kalayan

Screen Shot 2015-06-12 at 1.06.26 PM

రాజకీయ నాయకులందరూ దొంగలే అన్నది నిజం. వాళ్ళో వాళ్ళే కొట్టుకుంటూ వాళ్ళే రాజ్యాధికారంతో రాజకీయాలను మరింత దిగజారుస్తున్నారు. అడ్డంగా దొరికిపొయి కూడా మీసాలు మెలేసే స్థాయికి రాజకీయ నాయకులు ఎదిగిపొయారు. డబ్బు కులం ప్రభావంతో వేసే ఓట్లతో రాజ్యాధికారాన్ని సంపాదించుకొని ప్రజలకు ప్రశ్నించే హక్కులు లేకుండా చేసేసారు మన రాజకీయ నాయకులు.

ప్రజలకు అన్నీ తెలుసు. కానీ ఏమీ చేయలేని నిస్సాహాయులు. కేసీఅర్ చంద్రబాబుపై రాజకీయంగా పైచేయి సాధించడానికి రేవంత్ రెడ్డిని పట్టించాడు. చంద్రబాబు మీద ద్వేషంతో ఆనందించవచ్చేమో కాని, కేసీఆర్ మంచోడు అనుకుంటే పొరబాటు. రాష్ట్రం విడిపొయాక కూడా ఇంకా రెచ్చగొట్టే ప్రసంగాలు మానలేదు. ముఖ్యమంత్రి హోదాని కూడా దిగజార్జేస్తున్నాడు. ఈ కేసు నుంచి బయట పడటానికి చంద్రబాబు కూడా కేసీఆర్ మాదిరి ప్రాంతం పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు.

ఇటువంటి నీచ సమయంలో పవన్‌కల్యాణ్ స్పందించి తెలుగుదేశాన్ని విమర్శించాలని కొన్ని వర్గాలు కోరుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ లక్ష్యం “ప్రజలకు మెరుగైన జీవితం”, “రాజ్యాధికారం” కాదు. ఎలా స్పందించాలో తెలియని స్థితిలో, ఇలా తన తోటలో పండిన మామిడికాయలు తన వెల్ విషర్స్ కు పంపిస్తున్నాడు.

Filed Under: Pawan KalyanFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *