‘అత్తారింటికి దారేదీ’ కంటే ‘భాయ్’ పాటలు బాగుంటాయి

King-Nag

‘అత్తారింటికి దారేదీ’ కంటే ‘భాయ్’ పాటలు బాగుంటాయి
నాగార్జున

సినిమా రిలీజ్‌కు ముందు సినిమాను మాక్జిమమ్ హైప్ చేసి, తద్వారా మంచి ఓపినింగ్స్ రాబట్టుకొవడానికి అందరూ ప్రయత్నం చేస్తూ వుంటారు. అందులో భాగంగా తమకు తోచిన మాటలన్నీ చెపుతూ వుంటారు. ఆ మాటలు చెప్పేటప్పుడు, తమ పాత సినిమాలతో కాంపేర్ చేసుకొవడం మాములే.

ఆ విధంగా దేవిశ్రీ ప్రసాద్ ప్రివీయస్ మూవీ ‘అత్తారింటికి దారేదీ’ తోకాంపేర్ చేసేసి ‘అత్తారింటికి దారేదీ’ కంటే ‘భాయ్’ పాటలు బాగుంటాయి అని పుసుక్కున అనేసాడు నాగార్జున. అనేసిన తర్వాత కచ్చితంగా అది పవన్‌కల్యాణ్ సినిమా అని గుర్తు వచ్చి అయ్యో నోరు జారానే అని అనుకొని వుంటాడు. ఎందుకంటే మన హిరోలు తమ పక్క హిరోలతో పోల్చుకొని తాము గొప్ప అని చెప్పుకోరు.

నాగార్జున మనసులోని మాట అదే అయ్యి వుండవచ్చు కూడా. ఎందుకంటే ఎవరేజ్ సాంగ్స్‌ను పవన్‌కల్యాణ్ హిట్ చేయగలడని దేవిశ్రీ ప్రసాదే స్వయంగా చెప్పాడు.

read this:
ఎలాంటి మ్యూజిక్‌కైనా పవన్‌కల్యాణ్ సెట్ అయిపోతారు

Filed Under: Extended FamilyFeatured