రాబోయే పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్

big-movies-waiting-for-release

రాజకీయ నాయకులే కాదు,
తమకు తాము మేధావులు అనుకుంటున్న పనికిమాలిన మేధావులు కూడా
అసలు సమస్య ఏమిటి? సమస్యకు పరిష్కారం ఏమిటని ఆలోచించడం మానేసి .. సోనియా గాంధీని విమర్శిస్తున్నారు.

తెలంగాన నాయకులు విభజన కోరుకున్నారు. సీమాంధ్ర నాయకులు విభజనకు అంగీకరించారు. ఇప్పుడు నాలుక అడ్డగోలుగా తిప్పి మాట్లాడితే సరిపోదు.

సమైక్యాంధ్ర ఉద్యమం అంటే “ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు వుండ కూడదు” అని. ఏ ప్రాంత విద్వేషాలు వద్దు అని ఉద్యమిస్తున్నారో, అదే ప్రాంతం పేరుతో సోనియా గాంధీని విమర్శిస్తున్న, సీమాంధ్ర మేధావుల్లారా .. మీరు పనిమాలిన మేధావులు అని తెలుసుకోండి.

నాలెడ్జ్ కలిగివుండటం మేధావితనం అవ్వోచ్చు .. ఆ మేధావితానికి మీ తెలివితేటలు ఉపయోగించి ఎవరి మొప్పో పొందాలని చూస్తే మాత్రం మీది పనిమాలిన మేధావితనమే.

పనికిమాలిన మేధావులు అలా వుంటే, సీమాంధ్ర రాజకీయ నాయకులు:

1) ధైర్యంగా విభజనకు అంగీకరించాలి.

లేదా

2) తప్పు చేసామని ప్రజలకు క్షమాపణలు చెప్పి, రాజకీయలనుంచి విరమించాలి

ఒకరిని విమర్శించే హక్కు అర్హత ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడికీ లేదు. కాని, తామేదో ఉన్నతులం అన్నట్టు, ఒకరినొకరు విమర్శించుకుంటూ కాలం గడిపేస్తున్నారు.

అటు మేధావులు , ఇటు రాజకీయనాయకులు ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తూ సమస్యను సాగదీయాలనే ధోరణితోనే వున్నారు.

ఈ ధోరణి వలన అటో ఇటో అందోళనలు తప్పేట్టు లేవు. రాష్ట్రం మొత్తం పూర్తిగా సర్వ నాశనం అయ్యే వరకు ఇంతే. జన జీవనం రాష్ట్రంలో పార్షికంగా స్తభించింది. పూర్తిగా స్తంభించే టైమ్ కూడా దగ్గరలోనే వుంది.

దీని ప్రభావంతో రిలీజ్‌కు రెడీగా వున్న పెద్ద సినిమాల సంఖ్య ఐదుకు చేరింది.

  1. ఎవడు
  2. అత్తారింటికి దారేది
  3. రామయ్యా వస్తావయ్యా!
  4. భాయ్
  5. మసాలా

Filed Under: Pawan KalyanFeatured