ఎన్.టి.ఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్

రామయ్యా వస్తావయ్యా లో యంగ్ ఎన్.టి.ఆర్

రామయ్యా వస్తావయ్యా లో యంగ్ ఎన్.టి.ఆర్

హరీష్‌శంకర్ C/O గబ్బర్‌సింగ్. పవన్‌కల్యాణ్ ఇచ్చిన అవకాశాన్ని సూపర్ సద్వినియోగం చేసుకొని, పవన్‌కల్యాణ్‌కు తన పూర్వ వైభవాన్ని తిరిగి తేవడంతో పాటు, తాను ఓవర్‌నైట్ టాప్ డైరక్టర్స్‌లో ఒకడిగా నిలిచాడు.

ఇప్పటి వరకు ఎన్.టి.ఆర్ లో చూడని సరికొత్త నటనకు తోడు ఇంతకు ముందు సినిమాలలో ఏ నటన అందరికీ బాగా నచ్చిందో కలిపి రామయ్యా వస్తావయ్యా సినిమాలో చూపించడానికి ప్రయత్నం చేసా. ఎన్.టి.ఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది.

హరీష్‌శంకర్

సినిమా రిలీజ్‌కు ముందు సినిమాపై అంచనాలు పెంచడానికి ప్రతి ఒక్కరూ చెప్పే మాటలు అయినా, హరిష్‌శంకర్ ఏమి చెప్పుతున్నాడో, అది మూవీ స్టిల్స్‌లో కనిపిస్తుంది. ఎన్టీఆర్ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాడు. చాలా చాలా గ్లామర్‌గా వున్నాడు.

అందరినీ అలరించే పాటలు, డైలాగ్స్ & కామెడీ ఎపిసోడ్స్ కచ్చితంగా వుండటంతో పాటు, ఎవరూ ఊహించలేని సరప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా వుండే అవకాశాలు వున్నాయి. ఎన్.టి.ఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గ్యారంటీ. టాప్ 3 లో నిలుస్తుందా లేదా అనేదే చూడాలి.

Filed Under: Extended Family