సెన్సార్ కట్స్ ను పబ్లిసిటి కోసం

rgv

ఏదైనా సినిమాలో ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు వుంటే వాటిని కత్తిరించ వలసిన బాద్యత అధికారం సెన్సార్ బోర్డుకు వుంది. దర్శక నిర్మాతలు సెన్సార్ వారి గైడ్ లైన్స్ , నిబంధనలకు లోబడి సినిమాలు నిర్మించాలి.

సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా మనుషులే కాబట్టి, వారు పొరబాటుగా అర్దం చేసుకుంటే వారికి అర్ధం అయ్యేలా వివరించాలి. కావాలని కీలక సన్నివేశాలకు కట్స్ చెపితే కోర్టును ఆశ్రయించడమే లేదా తమ ఫిలిం అసోషియన్ లో పిర్యాదు చెయ్యడమో చెయ్యాలి.

కాని కొందరు తెలుగుసినిమా వాళ్ళు సినిమా సెన్సార్ కట్స్ ను పబ్లిసిటి కోసం వాడుకొంటు, చిల్లర రాజకీయ నాయకుల కంటే చిల్లరగా సెన్సార్ బోర్డు వాళ్ళను వ్యాఖ్యానిస్తున్నారు.

note:
పైన ఫోటో చూసి రాంగోపాలవర్మను ఉద్దేశించి పై కామెంట్స్ అనుకోవద్దు.. రాంగోపాలవర్మ అప్పలరాజు సినిమాలో పబ్లిసిటీ కోసం దర్శక నిర్మాతలు పడే పాట్లలో సెన్సార్ బోర్డు వాళ్ళను విమర్శంచడం కూడా పబ్లిసిటిలో ఒక భాగం అని చూపించడం మరిచిపోయాడు అని ఆ ఫోటో పెట్టడం జరిగింది..

Filed Under: Extended FamilyOthers