బాబోయ్ బోయపాటి

ram-charan-boyapati

కొందరు మెగా అభిమానులు ‘నాయక్ ‘ రోటిన్ గా వుందని కొన్ని విమర్శలు చేసినా , నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ .. అందులో డౌట్ ఏమి లేదు. చరణ్ లో చిరంజీవి కనిపించినందుకు ప్రతి మెగా ఫ్యాన్ వెరీ హ్యాపి. చరణ్ డాన్సస్ లో చరణ్ గ్రేస్ చూసి డబుల్ హ్యాపీ. చరణ్ ‘ఎవడు’ సినిమా తర్వాత బోయపాటి సినిమా అంటే మాత్రం మెగా అభిమానులంతా ఏక కంఠంతో ‘బాబోయ్ బోయపాటి’ అంటున్నారు.

దానికి కారణం .. నాయక్ లో వయలెన్స్ ఎపిసోడ్స్ అని చెప్పవచ్చు. వయలెన్స్ ఎక్కువ వుండటమే కాదు, విలన్స్ ను క్రూరంగా చూపించడానికి వారు చేసే పనులు మరీ క్రూరంగా వుండాలా అని అంటున్నారు.

ఇప్పుడు బోయపాటికి చాన్స్ ఇస్తే, నాయక్ కు మించి వయలెన్స్ తో సినిమా తీస్తాడని భయంతో ‘బాబోయ్ బోయపాటి’ అనటంలో తప్పులేదేమో.

వయలెన్స్ ఎక్కువ డిమాండ్ చేసే సబ్జక్ట్ తో కాకుండా, ఒక మంచి కథతో వస్తే బెటర్. బట్ బోయపాటి అంటే వయలెన్స్ ముందు గుర్తుకు వస్తాది.

Filed Under: Mega FamilyFeatured