ఇద్దరు అమ్మాయిలతో సమ్మర్ లో సందడి చేయనున్న బన్నీ

bunny

చరణ్ మంచి మాస్ ఫాంలో వున్నాడు ..
మహేష్ బాబు మంచి క్లాస్ ఫాంలో వున్నాడు ..
బన్నీ ‘జులాయి’ తో ఒక మాదిరి ఫాంలోకి వచ్చాడు ..
పవన్ కళ్యాణ్ కూడా మంచి ఫాంలో వున్నాడు ..
ఎన్.టి.ఆర్ కూడా ‘బాద్ షా’ తో మంచి ఫాంలోకి వచ్చేస్తే …
సందడే సందడి ..

పవన్ కల్యాణ్ కోరుకున్నట్లుగా 2013 mega ఫ్యామిలీతో పాటు, extended ఫ్యామిలీ సినిమాలు కూడా భారీ హిట్స్ సాధిస్తున్నాయి. నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ కలక్షన్స్ సాధిస్తుంటే, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఎవరేజ్ టాక్ తో ఇరగదీస్తుంది.

ఒకప్పుడు సంవత్సరానికి ఒక మెగా సినిమా వస్తే గొప్ప అన్నట్టు వుండేది. కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంవత్సరానికి రెండు సినిమాలు ఇస్తుంటే, రామ్ చరణ్ కూడా అదే బాటలో రెండు సినిమాలు ఇవ్వడానికి కష్టపడుతూనే వున్నాడు.

కాని మనకున్నవి నాలుగే సినిమా రిలిజ్ సీజన్స్. 1) సంక్రాంతి(జనవరి) 2) సమ్మర్ 3) జూలై 4) దసరా.

ఈ నాలుగు సీజన్స్ కూడా పవన్ కల్యాణో రామ్ చరణో ఆక్రమించేయడం వలన అల్లు అర్జున్ కు ఇబ్బందులు తప్పడం లేదు.

డిసెంబర్ 15 కి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఫస్ట్ కాపీ నిర్మాత చేతిలో పెడతా. ఇక రిలీజ్ ఆయన ఇష్టం అని దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా ముహూర్తం రోజు చెప్పాడు. ఈ సంక్రాంతి రామ్ చరణ్ ఆక్రమించడం వలన, పూరి జగన్నాథ్ స్పీడ్ ను స్లో చేయించి, డిసెంబర్ 15 ను ఫిబ్రవరి 15 చేసారు.

ఫిబ్రవరి తెలుగు సినిమాలకు అన్ సీజన్ కాబట్టి, మార్చి నెలాఖరుకు ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. So, బన్నీ ఇద్దరు అమ్మాయిలతో ఈ సమ్మర్ లో సందడి చేస్తాడన్న మాట.

‘బాద్ షా’ రిలీజ్ డేట్ తో చిక్కు:
జులాయి సినిమాకు రాజమౌళి ‘ఈగ’ అడ్డొస్తే , ఇప్పుడు ఎన్.టి.ఆర్ ‘బాద్ షా’ కూడా అదే టైంకు రెడీ అవుతుండటం విశేషం. ‘బాద్ షా’ & ‘ఇద్దరమ్మాయిలతో’ లకు బండ్ల గణేష్ నిర్మాత కాబట్టి, reasonable గ్యాప్ తోనే రిలీజ్ చేస్తాడు. but the problem is మార్చి నెలాఖరుకు ‘ఇద్దరమ్మాయిలతో’ వస్తుందా లేదా ‘బాద్ షా’ కోసం ఈ సినిమాను పొస్ట్ పోన్ చేస్తారా అని.

Filed Under: Mega FamilyFeatured