పూరి జగన్నాధ్ స్పీడ్ కు బన్నీ బ్రేక్

దర్శకనిర్మాతలతో బన్నీ

దర్శకనిర్మాతలతో బన్నీ

అల్లు అర్జున్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో..’.

ఒకప్పుడు పవన్ కళ్యాన్ బాగా స్లోగా పని చేసేవాడు. ఆ తర్వాత మహేష్ బాబు స్లోగా పని చేసే హీరోగా పేరొందాడు. అటువంటి హీరోలతో మూడు నెలల్లో సినిమాలు తీసి రిలీజ్ చేసి పూరి జగన్నాధ్ రికార్డ్ సృష్టించాడు.

అదే స్పీడులో బన్నీతో కూడా ‘ఇద్దరు అమ్మాయిలతో’ పూరి జగన్నాధ్ తీసేయలనుకున్నాడు కాని, బన్నీ సినిమా క్వాలిటీ కోసం పూరి జగన్నాధ్ స్పీడ్ కు బ్రేకులు వేస్తున్నాడు.

  1. ఇటీవలే ఈ చిత్రం బ్యాంకాక్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.
  2. ప్రస్తుతం స్పెయిన్‌లోని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడే నెలరోజుల పాటు నిరవధికంగా షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం.
  3. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో అధిక భాగం చిత్రీకరణ జరుపుకోనుంది.

పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్, కేథరిన్ కథానాయికలు. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీపసాద్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు,ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: చిన్నా, కొరియోగ్రఫీ: దినేష్, సహ రచయితలు: బి.వి.ఎస్.రవి-కల్యాణ్‌వర్మ.

Filed Under: Mega FamilyFeatured