మళ్ళీ ఆ ఊపు వస్తుందా

Pawan Kalyan

వర్కింక్ స్టిల్స్
మూవీ స్టిల్స్
టీజర్
ఆడియో రిలీజ్
ట్రైలర్
ఆడియో
పవన్ కల్యాణ్ పాడిన పాట
ఆగష్టు 9 రిలీజ్.

అలా ఒక దాని తర్వాత ఒకటి చాలా బాగా కుదిరి, అత్తారింటికి దారేది సినిమాపై హైప్ భలే క్రియేట్ అయ్యింది. రాజకీయలకు మాత్రమే పరిమితం అవుతుందనుకున్న పరిష్కారం లేని దిక్కుమాలిన సమస్య జనాల మూడ్ ను నాశనం చేసింది. సర్వ నాశనం చేసే దాకా ముగిసేట్టు లేదు.

అత్తారింటికి దారేది అక్టోబర్ 9 రిలీజ్ అని ఎనౌన్స్ చేసారు కాని, జనాలు మాట పక్కన పెట్టినా ఫ్యాన్స్ లో కూడా అసలు ఊపు లేదు. బహుశా చాలా రోజులు వుండటం వలనో, రాష్ట్ర విభజన అంశం మరింత జటిలం అవాకాశం వుండటం వలనో తెలియదు.

సినిమా అంతా రెడీ అయిపొయి రిలీజ్ అవ్వడం లేదని బాదపడుతున్న పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. రామయ్యా వస్తావయ్యా సినిమా సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అత్తారింటికి దారేది , రామయ్యా వస్తావయ్యా సినిమాలకు ఒక్క రోజే గ్యాప్ వుండటం వలన దిల్ రాజు బృందావనం కు లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చినట్టు, ఇప్పుడు కూడా ఇస్తాడేమోనని ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్‌కు మరో బెంగ. వాళ్ళ బెంగ అలా వుంటే, అక్టోబర్ 9న అయినా రిలీజ్ అవుతుందా అనే బెంగ పవన్ ఫ్యాన్స్‌లో అలానే వుంది.

Filed Under: Pawan KalyanFeatured