సురేందర్‌రెడ్డి కొడుకుతో ఆడుకుంటున్న చరణ్

Son of Surender Reddy

మెగాఫ్యాన్స్ చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. కారణాలు ఎన్నో. ముఖ్యంగా చెప్పాలంటే మొదటిది చిరంజీవి తీరు. మెగాఫ్యాన్స్‌కే కాదు, యావత్ తెలుగువాళ్ళకు చిరంజీవి అంటే గౌరవం వుంటుంది. రాజకీయాల్లో చిరంజీవి తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టి, చాలామందికి తప్పు అనిపించవచ్చు. దాని వలన కొందరు ఎగతాళి చెయ్యడానికి అవకాశం కలిపించినా, చిరంజీవిపై గౌరవం ఏ మాత్రం తగ్గదు. చిరంజీవి అభద్రతా భావానికి గురికావాల్సిన అవసరం లేదు.

“చిరంజీవి తారు రోడ్డు వేసాడు” , “చిరంజీవికి జై కొట్టాలి”, “చిరంజీవిని పొగడాలి”, “మెగా ఫంక్షన్స్‌లో చిరంజీవి మంత్రం మాత్రమే జపించాలి” లాంటివి ఒకెత్తు అయితే, దాసరి నారాయణరావు మాదిరి చిరంజీవి సెల్ఫ్‌డబ్బా వినలేక, వారి అసంతృప్తి ఎవరికీ చెప్పుకొలేక చిరంజీవి ఫంక్షన్స్ చూడటం మానేయడం మొదలుపెట్టారు మెగాఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే వెర్రోళ్ళు, వెర్రితనంతో ఎవరికి క్రేజ్ వుంటే వాళ్ళ పేరు అరుస్తూ వుంటారు. అలా అరవడం(చిరంజీవి బదులు పవన్‌కల్యాణ్ అని అరుస్తున్నారని) అవమానం ఫీల్ అవుతున్న అల్లు అర్జున్, తమను తాము దిగజార్చుకునే ఈ సెల్ఫ్ డబ్బాలు అసలు సిసలైన అవమానం అని తెలుసుకొవాలని మెగాఫ్యాన్స్ ఆశీస్తున్నారు.

ఇదే అదనుగా కన్నింగ్ స్టార్ మెగాఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టడం , అగ్గి మీద పెట్రోలు పోసినట్టు అయ్యింది. అల్లు అర్జున్ పవన్‌కల్యాణ్ కంటే ఎక్కువ, రామ్‌చరణ్ కంటే ఎక్కువ అంటూ, వేరే ఫ్యాన్స్ మెగాఫ్యాన్స్‌ను టీజ్ చెయ్యడం ఎక్కువ అవ్వడంతో మెగాఫ్యాన్స్ చాలా ఒత్తిడికి లోనవ్వుతున్నారు. పవన్‌కల్యాణ్ & రామ్‌చరణ్ లు త్వర త్వరగా సినిమాలు చేసేయాలని కోరుకుంటున్నారు. బాబాయ్-అబ్బాయ్ లు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో తెలియదు కాని, చాలా రిలాక్స్డ్‌గా పని చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.

రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధ్రువ’. ఈ చిత్రం కశ్మీర్‌ షూటింగ్‌ షెడ్యూల్‌లో తీసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ సురేందర్‌రెడ్డి కొడుకుని ఎత్తుకుని గుర్రం ఎక్కిస్తున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. రామ్‌చరణ్‌ అభిమానులు ఫేస్‌బుక్‌ ద్వారా ఈ ఫొటోలను పంచుకున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Filed Under: Featuredధృవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *