తారు రోడ్డు వేసింది అల్లు అరవిందే

AA

చిరంజీవి తారు రోడ్డు. మేము(మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హిరోలందరూ) హ్యాపీగా ఆ రోడ్డు మీద కార్లేసుకొని తిరుగుతున్నాం. అని అల్లు అరవింద్ & అల్లు అర్జున్ సరైనోడు పబ్లిసిటీలో భాగంగా మెగా అభిమానులకు రీచ్ అయ్యేలా చేయగల్గారు.

అసలు ఆ స్టేట్‌మెంట్‌ ముఖ్య వుద్దేశం, మెగా ఫంక్షన్స్‌లో పవర్‌స్టార్ పవర్‌స్టార్ అనే అరుపులకు బదులు మెగాస్టార్ మెగాస్టార్ అని అరవండి అని చెప్పడం. పవర్‌స్టార్ పవర్‌స్టార్ అని అరుస్తుంటే, మెగాస్టార్‌కు అవమానం అని ఎందుకు ఫీల్ అవుతున్నారో, ఎందుకంత అభద్రంగా ఫీల్ అవుతున్నారో ఎవరికీ అర్దం కాని విషయమే.

చిరంజీవి తారు రోడ్డు, తారు రోడ్డు వేసింది అల్లు అరవిందే అని అంటూ అల్లు అర్జున్ ఇండైరక్ట్‌గా చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపొలేదు. విజేత, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రౌడి అల్లుడు & మాస్టర్ లాంటి సినిమాలే కాదు, చిరంజీవి సినిమాలను ఒక వ్యూహం ప్రకారం రిలీజ్ చేస్తు, చిరంజీవి మార్కెట్ పెంచింది కూడా అల్లు అరవిందే కదా. అంతే కాదు రామ్‌చరణ్‌కు మగధీర ఇచ్చింది కూడా అల్లు అరవిందే.

bottomline:
అల్లు అరవింద్ చిరంజీవికి ఒక కవచం, గీతా ఆర్ట్స్ అంటే చిరంజీవి బ్యానర్ అనుకునే మెగాఫ్యాన్స్ తెలుసుకొవాల్సింది ఏమిటంటే, 1) చిరంజీవిని మెగాస్టార్ చేసింది అల్లు అరవింద్, 2) మగధీర కూడా అల్లు అరవిందే వేసిన బిక్షే, 3)గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు వారిది. అని అల్లు అర్జున్ అంటున్నాడు.

గమనిక: ఏ ఒక్కరినీ కించపరచాలనే వుద్దేశం పవన్‌ఫ్యాన్స్.కామ్ కు లేదు. చేయవలసిన అవసరం అంత కన్నా లేదు. అర్దం చేసుకొండి. అపార్దం చేసుకోవద్దు. (We don’t care. But ఓరేయ్ .. గిరేయ్ .. పిచ్చ నాకొడకా .. లఫూట్ గా .. అని కామెంట్స్ చేస్తున్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ గమనిక పెట్టడం జరిగింది)

Filed Under: సరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *