Chiranjeevi Response

image

It’s so important to know who you are and why you are – there will be noise around you it’s upto you to Listen to your inner voice 🙂

చిరంజీవికి ఒక రక్షణ కవచం అల్లు అరవింద్ & మరో రక్షణ కవచం పవన్ కల్యాణ్. చిరంజీవిని డైరక్ట్ గా విమర్శించలేక అల్లు అరవింద్ ని వాడుకుంటూ వుంటారు. చిరంజీవి రాజకీయ వైఫల్యంకు కారణం కూడా అల్లు అరవిందే అని అంటూ వుంటారు.

దాసరి తన ప్రసంగాలలో చిరంజీవి & రామ్ చరణ్ ను అవమానించే విధంగా ఇండైరక్ట్ గా కామెంట్స్ చెయ్యడం కొత్తకాదు. కాని గోవిందుడు అందరివాడేలే విషయంలో అడ్డంగా దొరికిపోయి, తిరిగి మీడియానే తప్పు పట్టే ప్రయత్నం చేసాడు.

ఇప్పుడు అల్లు అరవింద్ సమక్షంలో చిరంజీవి పేరు ఇగ్నోర్ చేసాడు. పిలిచి మరీ తన్నించు కోవడం అంటే ఇదేనేమో.

ఇంచుమించు ఇదే విధంగా ప్రవర్తించే మోహన్ బాబుకు పవన్ కల్యాణ్ గట్టి సమాధానం ఇచ్చి మెగా అభిమానుల ప్రసంశలు అందుకున్నాడు. కానీ చిరంజీవి మాత్రం మోహన్ బాబు తో చెట్టాపట్టాలేసుకొని తిరగడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

తప్పు మన మెగాఫ్యామిలి వైపు వుంచుకొని దాసరిని విమర్శించడంలో అర్ధం లేదంటున్నారు సీనియర్ మెగా అభిమానులు.

మెగా ఫంక్షన్స్ కు పిలవడం పెద్ద తప్పు.
దాసరికి పవన్ కల్యాణ్ సినిమా చెయ్యడం ఇంకా పెద్ద తప్పు.

చిరంజీవి రెస్పాన్స్ :
తన 150వ చిత్రానికి దాసరిని దర్శకత్వం చెయ్యమని అడిగినా ఆశ్చర్యం లేదంటున్నారు కుర్ర మెగా అభిమానులు.

Filed Under: Mega FamilyFeaturedTelugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *