రివ్యూ వ్రాసేవాళ్ళకి అల్లు అర్జున్‌ పంచ్

Allu Arjun

‘‘రివ్యూలు రాసేవాళ్లకు సినిమా గురించి తెలీదేమో అనిపిస్తుంటుంది. రాసేవాళ్లంతా బాగా చదువుకొన్నవాళ్లే కావొచ్చు. వాళ్ల స్థాయిలోనే ఆలోచిస్తున్నారు. 4జీ, వాట్సాప్‌ అంటూ ఎక్కడో ఉండిపోయారు. వాళ్లకు సీ క్లాస్‌ ఆడియన్స్‌ పల్స్‌ ఎలా తెలుస్తుంది? సినిమాని సినిమాలా చూసి సమీక్షించేవాళ్లు నాకు ఇక్కడ కనిపించడం లేదు’’

–AA

అల్లు అర్జున్‌కు ఒక విధంగా కాదు, చాలా బాగా ఎక్కేసింది. లేదా ఎవరన్నా ఎక్కించేసారో. “సినిమా సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే”. రివ్యూ వ్రాసేవాళ్ళతో కనెక్ట్ అయ్యేవాళ్ళు మాత్రమే వాళ్ళను ఫాలో అవుతారు. ఒకోసారి వాళ్ళ అభిప్రాయం కూడా మిస్‌ఫైర్ కావోచ్చు. సినిమాను ఎంజాయ్ చెయ్యకుండా, పొగరుతో రివ్యూ వ్రాసేవాళ్ళను కూడా కుమ్మి పాడేసాడు.

ఎంతో ఎత్తుకు ఎదగవలసిన సమయంలో, అనవసరమైన వాటికి అనవసరంగా రెస్పాండ్ అవుతూ ఎందుకిలా లేని శత్రువులను కూడగట్టుకుంటున్నాడు?

Filed Under: సరైనోడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *