Dasari is a Legend

dasari-narayana-rao-ram-charan

ఏమిటో .. దాసరికి మైకు దొరికిన ప్రతిసారి అంత రెచ్చిపోతూ ఇండైరక్ట్‌గా మెగాఫ్యామిలీనే టార్గెట్ చేస్తుంటే .. గట్టిగా రెస్పాండ్ అవ్వరు.

ఇండైరక్ట్ కాబట్టి OK అనుకోవచ్చు.

మొన్న డైరక్ట్‌గా గోవిందుడు అందరివాడేలే సినిమాను మూడు రోజులు సినిమా అని కామెంట్ చేసినా ఇంకా ‘Dasari is a Legend’ అనటం దారుణం. అదే సందర్భంలో హిరో వారసులు మొఖాలు చెక్కించుకుంటున్నారు .. వాళ్ళ సినిమాలు రుద్దుతున్నారని అని అన్నాడు. మనిషి ఎంత సాధించినా .. పిల్లలపై కూడా ఈర్ష్య పడుతూ ఇలాంటి చెత్త కామెంట్స్ చేసేవాడు లెజెండ్ ఎలా అవుతాడని మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు.

ఆడియో ఫంక్షన్‌లో పవర్‌స్టార్ పవర్‌స్టార్ అని అరవడం గోల చెయ్యడం ఒక బ్యాడ్ అనవాయితీగా తయారవుతుంది. దానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి ‘పిల్లా .. నువ్వు లేని జీవితిం’ ఆడియో ఫంక్షన్‌లో నాగేంద్ర బాబు ‘ఓరేయ్ .. మాట్లాడేటప్పుడు అతిధులని డిస్ట్రర్భ్ చేస్తూ పవర్‌స్టార్ పవర్‌స్టార్ అని అర్వకండ్రా..’ అని సిరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు. ఇది పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడే సందర్భం కాదు కాదు కాబట్టి, పవన్‌కల్యాణ్ గురించి ప్రస్తావించలేదు. చాలా బాగుందనిపించింది.

అదే విధంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు దాసరికి కూడా ఇదే టైపులో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే బాగుండునని అభిమానులు ఆశీంచారు. రామ్‌చరణ్ నుంచి ఆశీంచారు కాని, కోపం తగ్గించుకోని కాంట్రవర్సీలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్టు వున్నాడు. ఈ విషయంలో ‘Dasari is a Legend’ అంటూ అభిమానులను నిరుత్సాహ పరిచాడు.

మెగా అభిమానులు దాసరి సినిమాలు సెల్ఫ్ బ్యాన్ తప్ప చేయగల్గింది ఏమీ లేదు.

Filed Under: Extended Familyరేయ్