దేవిశ్రీ ప్రసాద్ కు 2013 ఎలా వుండబోతుందో

దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్

2012:
గబ్బర్ సింగ్ సంగీతంతో సినీ అభిమానులకు ‘కెవ్వు కేక’ పుట్టించిన దేవీశ్రీ ప్రసాద్, ‘గబ్బర్ సింగ్… గబ్బర్ సింగ్’, ‘కొప్పున పూలెట్టుకుని..’ లాంటి అద్దిరిపోయో సంగీత, నేపధ్య- సంగీతాలే కాకుండా, పెన్నుపట్టి ‘ ఏం పిల్లా…’ అంటూ రేస్ లో ముందుకు దూసుకు పోయిన దేవిశ్రీ… సంగీతంతో ప్రేక్షకులను మైమపరిపించడంలో తనకు సాటిలేదని నిరూపించుకున్నాడు.

అదే విధంగా బన్నీకి కూడా జులాయితో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఇండైరక్ట్ గా 2012 మెగా హీరోల విజయాలలో భాగమయ్యాడు.

సేమ్ మ్యాజిక్ ని 2013లో కూడా రిపీట్ చేయనున్నాడా?

  1. ప్రభాస్ ‘మిర్చి’ ఆడియో ఇన్ స్టెంట్ సన్సెషనల్ హిట్ కాకపోయినా, మాస్ కు బాగా నచ్చే పాటలతో బాగానే అలరిస్తుంది.
  2. బన్నీ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా – ఫస్ట్ టైమ్ పూరి జగన్నాధ్ తో కలిసి పని చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ .. పూరి మార్క్ మ్యూజిక్ కు తన మార్క్ ఎలా యాడ్ చేస్తాడో చూడాలి.
  3. రామ్ చరణ్ ‘ఎవడు’ – ఫస్ట్ టైం పెద్ద హిరోతో పని చేస్తున్నాడంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రత్యేక శ్రద్దతో చెయ్యాలి. అదీ మెగాస్టార్ తనయుడు అంటే మరింత శ్రద్ధ అవసరం. ఈ అల్భం కూడా ఇంటరెస్టింగ్ తో ఎదురు చూడతగినదే.
  4. మహేష్ బాబు సినిమా – ఫస్ట్ టైం మహేష్ బాబు సినిమాకు పని చెయ్యడమే కాదు, దేవిశ్రీ ప్రసాద్ తో బాగా ట్యూన్ అయ్యి, దేవిశ్రీ ప్రసాద్ నుంచి అత్యంత అద్భుతమైన మ్యూజిక్ ను రాబట్టుకునే సుకుమార్ ఈ సినిమాకు దర్శకుడు కావడం మరో పెద్ద విశేషం.
  5. పవన్-త్రివిక్రమ్ – Movie of 2013 గా మొన్ననే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ సినిమాకు, ఇప్పటికే రెండు మంచి పాటలు అందించాడని వినికిడి.

పై మూవిస్ కాంబినేషన్స్ చూస్తుంటేనే 2013 లో కూడా బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పేయవచ్చు.

Filed Under: Extended FamilyFeatured