తెలుగు సినిమా ఇండస్ట్రికీ దిల్ రాజు పెద్ద వరం

Dil-Raju

తెలంగాణలో తమ సినిమా రిలీజ్ కు ఇబ్బందులు వుండవనెమో ఇప్పుడు ప్రతి పెద్ద హిరో ‘దిల్ రాజు’ వెనకాల పడుతున్నారు. ఒక సినిమా షూటింగ్ లో వుండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. —> I am just Kidding 🙂

అశ్వనీదత్ సినిమాలలో కనిపించే రిచ్‍నెస్‍తో శ్యాంప్రసాద్ రెడ్డి సినిమాలలో ఉండే పట్టుతో సినిమా చేసి, అల్లు అరవింద్‍లా బిజ్‍నెస్ చేయగల నిర్మాత ‘దిల్ రాజు’.

దిల్ రాజు కు ఏమి బ్యాగ్రౌండ్ ఉందో, ఎంత ఎలా కష్టపడ్డాడో తెలియదు కానీ, ఒక పక్క ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిస్తూ, హీరోలు ఆశీంచే భారీ రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నాడు.

పెద్ద హిరోలు సహితం ఒకప్పుడు అశ్వనీదత్ వైజాయింతీ మూవిస్‍లో పని చెయ్యటం అంటే గర్వంగా చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నిర్మాత సక్సస్‍ఫుల్ హిరో చుట్టూనో, డైరక్టర్ చూట్టూనో తిరగటమే సరిపోతుంది. సినిమా అనేది నిర్మాతపరంగా చూస్తే పూర్తి వ్యాపారత్మకం. డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో రిస్క్ చేసే నిర్మాతకు విలువ తగ్గిపోతుంది.

ఇటువంటి పరిస్థితులలో తెలుగు ఇండస్ట్రికీ దిల్ రాజు పెద్ద వరం అనుకోవచ్చు . ఇమేజ్ లేని నటీనటులకు దిల్ రాజు సినిమాలో నటించటం వాళ్ళ కెరీర్ కు పెద్ద ఇమేజ్ లభిస్తుంది. దీనికంటే ముందుగా చెప్పుకోవలసింది ఆయన జడ్జ్ మెంట్ మరియు కొత్త దర్శకులకు అవకాశం. ఆయన దగ్గరే అవకాశం రాకపోయినా ఆయనను ఇంప్రెస్ చెయ్యాలి అని తలంపుతో ఏ కొత్త డైరక్టర్ అయిన సబ్జ్ క్ట్ తయారు చేసుకుంటే కూడా బ్రేక్ రావటం ఖాయం. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రికీ దిల్ రాజు పెద్ద వరం.

ఎవడు సినిమాపై మెగా ఫ్యామిలీ భారీ ఆశాలు పెట్టుకుంటే, రామయ్య వస్తావయ్యా సినిమా నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే ‘దిల్ రాజు’ నిర్మాత కాబట్టే , రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఒప్పుకున్నాడు. ఎన్.టి.ఆర్, గబ్బర్ సింగ్ దర్శకుడితో చేయ గల్గుతున్నాడంటే దిల్ రాజే కారణం.

Filed Under: Extended FamilyFeatured