రెండోసారి వెనక్కి తగ్గిన దిల్ రాజు

charan-pawan

పెద్ద హీరోలు గ్యాప్ లేకుండా సినిమాలు మీద సినిమాలు చేస్తుండటం వలన పెద్ద సినిమాల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు చిన్న సినిమాకు థియేటర్స్ దొరకడం లేదు అనే సమస్య ఒక్కటే వుండేది. ఆ సమస్యకు ఇప్పుడు మరో ‘గ్యాప్’ సమస్య తోడయ్యినట్టే. అందుకే తెలివైన వాళ్ళు సినిమా మొదలయిన రోజే రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు ‘ఖలేజ’ కోసం బృందావనం వాయిదా వేసుకున్న దిల్ రాజు, ఇప్పుడు పవన్ కళ్యాన్ ‘అత్తారింటికి దారేది’ కోసం ఎవడు వాయిదా వేసుకుంటున్నాం అని అంటున్నాడు.

రాజమౌళి ‘ఈగ’ కోసం అల్లు అర్జున్ తన ‘జులాయి’ ని నెల వాయిదా వేసుకున్నాడు.

ఇటువంటివి ఇంకా ఎన్ని చూడాలో!

ఇక ఒక మాదిరి సినిమాలు, చిన్న సినిమాల పరిస్థితి అయితే దారుణం. ఒక పక్క పెద్ద సినిమాలతో పోటి పడలేక, మరో పక్క థియేటర్స్ దొరక్క, పెద్ద సినిమాల వాయిదాలకు అనుగుణంగా తమ సినిమా రిలీజ్ డేట్స్ కూడా మార్చుకోవాలంటే నరకమే.

Filed Under: Mega FamilyFeatured