DJ దువ్వాడ జగన్నాధం Exclusive Review

సినిమా ఎలా వుంది?
సాగర సంగమం లాంటి క్లాస్ సినిమా కాదు. సమర సింహా రెడ్డి లాంటి పక్కా మాస్ కమర్షియల్ మూవీ. హరీష్ శంకర్ ఆగ్రహారం బ్యాక్ డ్రాప్ అదిరింది.

హిట్టా ఫట్టా?
మాస్ సినిమా ఫట్ అయ్యే సమస్య లేదు. సరైనోడు కంటే పెద్ద హిట్.

బన్ని, బ్రహ్మణుడు క్యారెక్టర్ ఎలా చేసాడు?
చించి చేట చేసాడు. వేరే క్యారెక్టర్ కూడా ఏమీ తగ్గలేదు. నటుడిగా & స్టార్ గా బన్నీ మరో పది మెట్లు ఎక్కాడు.

పాటలు ఎలా వున్నాయి?
పాటలన్నీ బాగున్నాయి. కేవలం డాన్స్ మాత్రమే కాకుండా, ప్రతి సాంగ్ ఒక్కోక్క కాన్సప్ట్ తో చేసారు.

ఫైట్స్ ఎలా వున్నాయి?
అన్ని ఫైట్స్ హైలట్. మాస్ కు ఎంత కిక్ ఇవ్వాలో అంత కిక్ ఇచ్చేలా వున్నాయి.

కథ ఎలా వుంది?
పక్కా మాస్ కమర్షియల్ కథ. ఇంత కన్నా ఎక్కువ ఎక్సపెట్ చేస్తే, ఎక్సపెట్ చేసేవాళ్ళది తప్పు.

హిరోయిన్ పూజా హెగ్డె ఎలా చేసింది?
ఎలా చేసిందనే కంటే, ఎలా వుందంటే కరెక్ట్. ఈ సినిమాకు పెద్ద ప్లస్.

రివ్యూలు ఎందుకు పాజిటివ్ గా లేవు?
వెబ్ రివ్యూలు మాస్ సినిమాలను చిన్నచూపు చూస్తాయి. అలానే అనుకొవచ్చు.

క్లైమాక్స్ ఎలా వుంది?
సుబ్బరాజు క్యారెక్టరైజేషన్ తో క్లైమాక్స్ వినోదంగా డిజైన్ చేసారు. సరదాగా తీసుకుంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సిరియస్ గా తీసుకుంటే వెటకారం చెయ్యొచ్చు. మాస్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

ఏమి బాగోలేదు?
మెగా అభిమానుల అండతో ఎదిగి, మెగా అభిమానులను అవమానించే విధంగా అల్లు అర్జున్ ప్రవర్తన ఒక్కటే బాగోలేదు.

గ‌మ‌నిక‌: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే. ఇది స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది.

Filed Under: DJHari Reviews

commentscomments

  1. siva says:

    bongula unna cinemaki hit review na?
    is this pawanfans site or anti fans site.
    u r writing against pawankalyan for good issue also. change the name. sarrainodu waste movie. but compare to dj sarrainodu ok.

  2. Subhaani says:

    This is Allu arvind’s site naam kevaste pawanfans.com….totally irritating this review….Fake cunning site…

  3. Hari says:

    ఎవరి అభిప్రాయం వాళ్ళది బాస్. మీరు సాగర సంగమం లాంటి క్లాస్ సినిమా ఎక్సపెట్ చేసి సినిమా చూసారెమో.

  4. RAJ says:

    This is not only first time to praise other heroes even movie is disaster. But for Pawan kalyan always gave -ve response. Peru matrame Pawanfans, lopala anta exact reverse.

  5. Hari says:

    RAJ, మీరు తప్పుగా ఊహించుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *