Dumb fans of Rajni

Share the joy
  •  
  •  
  •  
  •  

rgv-rajinikanth

Ram Gopal Varma ‏@RGVzoomin
Dumb fans of Rajni who dint realise my tweets r compliment

Some superdumb fans of Rajnikant dint even realise that I was only complimenting the superstar

అబద్దాలు .. నిజాలు మిక్స్ చేసి అటు మీడియాను, ఇటు తన ట్వీటర్ ఫాలోయర్స్‌ను వెర్రి పప్పలని చేస్తూ ఆనందం పొందడం రాంగోపాలవర్మకు ఒక వ్యసనం. పొడగ్తలతో వెటకారం చెయ్యడం, నిజాలతో వెటకారం చేస్తున్నట్టుగా పొగడటం, ఒక్క రాంగోపాలవర్మకే చెల్లు. ఆ ట్వీట్స్‌ను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్దాలు తీసుకుంటూవుంటారు. ఒక దర్శకుడిగా స్టార్ హిరోలు అంటే, స్టార్‌కు వుండే అభిమానులంటే బాగా ఈర్ష్య వుంది. ఈ ఈర్ష్యను తన తెలివితేటలు ఊపయోగించి చాలా తెలివిగా పొగుడుతున్నాను అనుకుంటూ వుంటారు.

అదే విధంగా రజనీకాంత్‌ను, “ఇంత చెండాలంగా వున్న వీడు హిరో ఏమిటి? వీడికి క్రేజ్ ఏమిటి? వీడి నల్ల ఫేసు చూసి ఆ అభిమానం ఏమిటి? నిజంగా వీడు చాలా గ్రేట్” అని అర్దం వచ్చే విధంగా ట్వీట్స్ చేసాడు. రజనీ ఫ్యాన్స్‌కు కాలినట్టు వుంది. బాగా ఎక్కేసినట్టు వున్నారు. క్రింద పడ్డా తనదే పైచేయ్యి కావాలని, లాస్ట్ పంచ్ తనదే కావాలని కోరుకునే రాంగోపాలవర్మ, రజనీ అభిమానులను ఉద్దేశించి “నేను తిట్టలేదురా , పొగుడుతున్నాను వెధవల్లారా” అని సరికొత్త ట్వీట్ చేయవలసి వచ్చింది. దానికి సపోర్ట్‌గా రజనీ తన అందంపై తను వేసుకున్న ఒక జోక్ వీడియోను కూడా పోస్ట్ చేసాడు.

bottomline:
రాంగోపాలవర్మను శ్రీనువెట్ల-కోన వెంకట్ బాగా స్టడీ చేసారు. ఆ మనస్థత్వాన్ని దూకుడు & బాద్‌షా సినిమాల్లో బాగా ఎలివేట్ చేసారు.

Filed Under: Extended Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *