early summer అంటే

sardaargabbarisnghearlysummer

సినిమా పబ్లిసిటీ కోసం, హైప్ చెయ్యడం కోసం “మన హిరోలు” “మన దర్శకులు” “మన నిర్మాతలు” ట్వీటర్‌ను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. పవర్‌స్టార్ మాత్రం సినిమాల కోసం కాకుండా, రాజకీయల కోసం వాడుకుంటున్నాడు.

సినిమా షూటింగ్‌లో వున్నప్పుడే అన్ని విషయాలు చెప్పేస్తే, ప్రేక్షకులకు థ్తిల్ వుండదని, సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు రావడానికి పవన్‌కల్యాణ్ అసలు ఇష్టపడడు. కాని అభిమానుల అత్యుత్సాహం, బాగా బిజినెస్ చేసుకొవడానికి నిర్మాత, ప్రేక్షకులను రైట్ ఎక్సపెటేషన్స్‌తో థియేటర్‌కు రప్పించడానికి దర్శకుడు .. ఇలా సినిమా విషయాలు బయటకు వచ్చేస్తూ వుంటాయి.

పవన్ కళ్యాణ్ పవర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం పబ్లిసిటి & హైప్ చేసే బాద్యత ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్ తీసుకున్నాడు. early summer రిలీజ్ అని అంటున్నాడు. early summer అంటే ఏప్రిల్ మొదటి వారమో, మే మొదటి వారమో తెలియక అభిమానులే కాదు, ఆ టైంలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న హిరో/నిర్మాతలు కూడా తికమక పడుతున్నారు. ఇలా కన్‌ఫ్యూజన్ తో కూడిన మేసేజ్ వెనుక అర్దం ఏమిటో? .. నెల పేరు చెప్పవచ్చు కదా.. దాని కనుగుణంగా అందరూ ప్లాన్ చేసుకుంటారు.

Sharrath Marar ‏@sharrath_marar
#SardaarGabbarSingh Hyderabad schedule fast progressing and to continue till the end of the month. #PSPK keen on an early summer release.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *