‘ఎవడు’ సినిమా రిలీజ్ ఖరారు

ram charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కించిన ‘ఎవడు’ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితుల నేపత్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అయితే ఎట్టకేలకు ‘ఎవడు’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 19న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

‘ఎవడు చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు, మళయాలంలో కూడా విడుదల చేస్తున్నాం. తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. అల్లు అర్జున్ కనిపించేది పది నిమిషాలే అయినా…ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం కనిపిస్తుంది. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. మా సంస్థల్లో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా ఇది. అత్యధిక థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది. మెగా అభిమానుల అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుంది’
నిర్మాత దిల్ రాజు

‘ఎవడు చిత్రం చాలా బాగుంటుంది. దేవిశ్రీ ఆడియో సూపర్ హిట్టయింది. రామ్ చరన్ నటన, బన్నీ అప్రియరెన్స్ అదిరిపోతుంది. కాజల్ చేసింది చిన్న పాత్రే అయినా గుర్తుండి పోతుంది. హీరోయిన్స్ శృతి హాసన్, అమీ జాక్సన్ చాలా అందంగా ఉన్నారు. రామ్ చరణ్ డాన్స్ అదిరిపోతాయి. డిసెంబర్ 19న సినిమా విడుదల చేస్తున్నాం’
సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్

జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయి కుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్ : సెల్వం, ఆర్ట్: ఆనంద్ సాయి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Filed Under: Mega FamilyFeatured